General News

కొద్ది క్షణాల్లో పెళ్లి.. ఒక్కసారిగా కాల్పుల మోత.. ఏమైందంటే..?

పెళ్లి అనగానే ఇళ్లంతా సందడి సందడిగా కనపడుతుంది. బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది. ఓ ప్రదేశంలో మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒక్కసారిగా ఆగిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే.. వివాహం జరిగే వేడుక వద్ద వరుడి తరఫు బంధువులు విపరీతంగా కాల్పులు జరిపారు. దీనిలో వధువు మామకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. వివాహ వేడుక వద్దనే ఇలా ఉన్నారంటే.. రేపు పెళ్లి అయిన తర్వాత తాను లేని సమయంలో ఎలా ఉంటుందో అనే భయం వేస్తుందని.. వధువు వాపోయింది. దీంతో ఆమె వాళ్లతో పెళ్లి సంబంధాన్ని తెంచేసుకుంది. దీంతో పెళ్లి అక్కడిక్కడే ఆగిపోయింది. ఇలా ప్రకటించిన వెంటనే వధువు తరఫు బంధువులు వరుడి కుటుంబం పై దాడి చేసి.. కారును పగలగొట్టి అతని బంధువులను బంధించారు.

దీంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాల్పులు ఎవరు జరిపారనే వివరాలను పోలీపులు ఆరా తీశారు. పెళ్లిలో తీసిన వీడియోల ఆధారంగా ఎవరు కాల్పులు జరిపారో తెలుసుకున్నారు.

వరుడు షాజాద్ అతని సోదరుడు పప్పు, సానుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పలావత్ తెలిపారు. లెసెన్స్ కలిగిన ఆయుధం నుంచి బెల్లెట్ పేలితే.. ఆ ఆయుధ లైసెన్స్ రద్దుకు నివేదిక పంపిస్తారని రవీంద్ర పలావత్ అన్నారు. ఇక గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

2 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

2 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

2 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

2 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

3 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

4 hours ago