Health News

‘విటమిన్ – సి’తో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు.. ఆ వ్యాధులు కూడా నయం అవుతాయి..

విటమిన్లలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి కొవ్వులో కరిగేవి. మరొకటి నీటిలో కరిగేవి. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవంటే ఏ,డీ,ఈ,కె. అయితే నీటిలో కరిగే విటమిన్లలో బీ కాంప్లెక్స్ అండ్ సీ విటమిన్. సీ విటమిన్ అనేది ఎక్కువగా సిట్రస్ ఫలాల్లో దొరుకుతుంది. అంటే.. జామ, ఉసరి లాంటి పండ్లల్లో. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ‘Vitamin C’ తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దీని ద్వార జలుబు, జ్వరం కూడా తగ్గిపోతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు రక్షణ కవచంగా ఉండటమే కాకుండా.. కంటి సమస్యలు, చిన్న వయస్సుల్లోనే చర్మంపై వృద్ధాప్య చాయలు రావడం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఇవి ఎక్కువగా తాజా పండ్లు , కాయగూరల్లో ఉంటుంది. ఇంకా ఈ విటమిన్ సీ అనేది..ద్రాక్షపండు, నారింజ, కీవీ, నిమ్మ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, టమోటా, జామ, ఉసిరి, ముల్లంగి ఆకులు, ఎండు ద్రాక్ష, పాలు, బీట్‌రూట్, ఉసిరి, క్యాబేజీతోపాటు క్యాప్సికమ్ మొదలైనవి వాటిల్లో పుష్కలంగా విటమిన్ సి కలిగి ఉంటాయి.

ముఖ్యంగా జలుబు అనేది విటమిన్ సీ తీసుకునే వారికి దరి చేరదు. బాగా జలుపు చేసినప్పుడు ఉసిరి, నిమ్మ లేదా తేనె కలిపిన టీని సేవిస్తే మంచింది. విటమిన్ సీ ని సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది శరీరంలోని అన్నిరకాల కణాజాలాలను వృద్ధి చేస్తుంది చేస్తుంది. నష్టపోయిన కణజాలాన్ని సరిజేస్తుంది. మహిళలకు 75 mg, పురుషులకు 90 mg, గర్భిణీ స్త్రీలకు 85 mg, పాలిచ్చే మహిళలకు 120 mg మోతాదులో ప్రతిరోజూ విటమిన్-సి తీసుకోవాలి.

విటమిన్ సి లోపం వల్ల రక్తహీనత, చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాలు నయం అయ్యే సమయం, పొడిబారడం, చీలిపోవడం, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం తగ్గిపోవడం, చిన్న గీతల నుంచి కూడా రక్తం కారడం వంటి అనేక లక్షణాలకు కారణమవుతుంది. అందుకే ప్రతీ రోజు సిట్రస్ లాంటి ఫలాలను తింటే శరీరంలో విటమిన్ సీ అనేది పుష్కలంగా ఉండి పై వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago