విటమిన్లలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి కొవ్వులో కరిగేవి. మరొకటి నీటిలో కరిగేవి. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవంటే ఏ,డీ,ఈ,కె. అయితే నీటిలో కరిగే విటమిన్లలో బీ కాంప్లెక్స్ అండ్ సీ విటమిన్. సీ విటమిన్ అనేది ఎక్కువగా సిట్రస్ ఫలాల్లో దొరుకుతుంది. అంటే.. జామ, ఉసరి లాంటి పండ్లల్లో. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ‘Vitamin C’ తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దీని ద్వార జలుబు, జ్వరం కూడా తగ్గిపోతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు రక్షణ కవచంగా ఉండటమే కాకుండా.. కంటి సమస్యలు, చిన్న వయస్సుల్లోనే చర్మంపై వృద్ధాప్య చాయలు రావడం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఇవి ఎక్కువగా తాజా పండ్లు , కాయగూరల్లో ఉంటుంది. ఇంకా ఈ విటమిన్ సీ అనేది..ద్రాక్షపండు, నారింజ, కీవీ, నిమ్మ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, టమోటా, జామ, ఉసిరి, ముల్లంగి ఆకులు, ఎండు ద్రాక్ష, పాలు, బీట్‌రూట్, ఉసిరి, క్యాబేజీతోపాటు క్యాప్సికమ్ మొదలైనవి వాటిల్లో పుష్కలంగా విటమిన్ సి కలిగి ఉంటాయి.
ముఖ్యంగా జలుబు అనేది విటమిన్ సీ తీసుకునే వారికి దరి చేరదు. బాగా జలుపు చేసినప్పుడు ఉసిరి, నిమ్మ లేదా తేనె కలిపిన టీని సేవిస్తే మంచింది. విటమిన్ సీ ని సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది శరీరంలోని అన్నిరకాల కణాజాలాలను వృద్ధి చేస్తుంది చేస్తుంది. నష్టపోయిన కణజాలాన్ని సరిజేస్తుంది. మహిళలకు 75 mg, పురుషులకు 90 mg, గర్భిణీ స్త్రీలకు 85 mg, పాలిచ్చే మహిళలకు 120 mg మోతాదులో ప్రతిరోజూ విటమిన్-సి తీసుకోవాలి.
విటమిన్ సి లోపం వల్ల రక్తహీనత, చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాలు నయం అయ్యే సమయం, పొడిబారడం, చీలిపోవడం, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం తగ్గిపోవడం, చిన్న గీతల నుంచి కూడా రక్తం కారడం వంటి అనేక లక్షణాలకు కారణమవుతుంది. అందుకే ప్రతీ రోజు సిట్రస్ లాంటి ఫలాలను తింటే శరీరంలో విటమిన్ సీ అనేది పుష్కలంగా ఉండి పై వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది.


































