Brigida Saga : తమిళంలో వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిన ముద్దు గుమ్మ బ్రిగిదా సాగ. అయినా తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్ తో తెలుసు. అయితే తన పేరుతో చెప్తే గుర్తు పట్టరేమో కానీ పవి టీచర్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు కుర్రకారు. పవి టీచర్ గా అంత ఫేమస్ అయిన బ్రిగిదా తమిళంలో సినిమాలో కూడా నటించింది. మొదటి సినిమాతోనే బాగా వైరల్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో శివబాలాజీ నటిస్తున్న ‘సింధూరం’ సినిమాలో నటించింది. ఇక తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, మొదటి సినిమా లోనే న్యూడ్ సీన్ ఎలా చేసింది లాంటి ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది.

న్యూడ్ గా చేసినందుకు బాగా ట్రోల్…
బ్రిగిదా ఆహా కళ్యాణం వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఆపైన పలు వెబ్ సిరీస్ లను చేసిన ఈ ముద్దు గుమ్మ అలానే సినిమాలను కూడా చేసింది. మొదటి సినిమా రాధాకృష్ణ పర్తిభన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ అలానే అందులో నటించింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో న్యూడ్ గా నటించడంతో ఒక్కసారిగా ఈమె వైరల్ అయింది. అలాగే నెగెటివిటీని మూటగట్టుకుంది.

అయితే ఆమె ఆ సన్నివేశం కోసం న్యూడ్ గా నటించలేదని, అక్కడ కెమెరా మెన్ అలా తీసాడే కానీ తను డ్రెస్ వేసుకున్నాను అంటూ తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది బ్రిగిదా. అయితే చాలా మంది న్యూడ్ గా నటించానని ట్రోల్ చేయడంతో కొద్ది రోజులు చాలా బాధపడ్డానని డిప్రెషన్ లో ఉండిపోయానని చెప్పారు. కాకపోతే ఆ సినిమాలో తన నటనను చాలా మంది మెచ్చుకున్నారని ముఖ్యంగా రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు మేచ్చుకోవడం హ్యాపీగా అనిపించిందని చెప్పింది.
































