C. Kalyan : చాలా ఏళ్ల నుండి సినిమా రంగంలో ఉంటూ సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి సికే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మించారు. సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా సి కళ్యాణ్ వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన పలు ఇంటర్వ్యూల్లో సినిమాల గురించి తెర వెనుక సంగతులను చెబుతుంటారు. అటు తెలుగు తమిళ ఇండస్ట్రీ రెండిటిలోనూ సత్సంబంధాలు కలిగిన కళ్యాణ్ తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కు చాలా సన్నిహితంగా మెలిగారు. ఇక తెలుగు సినిమా నిర్మాతల మండలిలో ఉన్న అయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండస్ట్రీ గురించి తెలిపారు.

ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నాం…
నిర్మాతల మండలిలో కొద్దిరోజులుగా కోల్డ్ వార్స్ అలానే వివాదాలు చాలానే జరుగుతూ వస్తున్నాయి. తాజాగా నిర్మాతల మండలి ఎన్నికల గోల మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎన్నికలు ఫిబ్రవరి 26న జరుగుతాయంటూ ముందు ప్రకటించినా ఆ తరువాత ఈ ఏడాది ఎలక్షన్ ఉండదు అనే వార్తలు బయటికి వచ్చాయి. కావాలనే ఎన్నికలు వాయిదా వేసి ఇంకో ఏడాది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొనసాగుతుంది అనే ఆరోపణలు వినిపించాయి. ఇక ఈ విషయాల మీద క్లారిటీ ఇస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబెర్ గా సి కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే నిర్మాత మండలికి ఎలక్షన్ జరుగుతుందని చెప్పారు.

అలానే నిర్మాతల మండలి రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఇద్దరు నిర్మాతల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కే సురేష్, అలానే నిర్మాత యలమంచలి రవి చంద్రన్ అనే ఇద్దరు నిర్మాతలను నిర్మాతల మండలి నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. నిర్మాత సురేష్ ను మూడేళ్లు బహిష్కరిస్తునట్లు తెలిపారు. అయితే వారికి నిర్మాతల మండలి నుండి ఏదైనా సహాయం కావల్సినపుడు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపవచ్చని తెలిపారు. నిర్మాతల మండలి కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా అది సి కళ్యాణ్ అయినా ఇలానే చర్యలు తీసుకుంటామని కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.



























