Captain Danis Damarla : సముద్రం చూడాలన్నా బీచ్ అందాలను ఆస్వాదించాలన్నా ఎవరికైనా ఇష్టమే. సముద్రం మనకు ఎన్నో ఇస్తోంది అలాగే దేశాల మధ్య సరుక రవాణా కూడా సముద్ర మార్గాల ద్వారా జరుగుతుంది. ఇండియాకు మూడు దిశలా సముద్రం ఉండటం వల్ల మన దేశ వర్తకం సముద్ర మార్గం ద్వారా ఎక్కువగా జరుగుతుంది. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే మరో వైపు సముద్ర మార్గం వల్ల రక్షణ సమస్యలు ఉంటాయి. శత్రు దేశాలకు సముద్ర మార్గం దేశంలోకి చొరబడటానికి మంచి మార్గం అందుకే తీర ప్రాంతాల్లో గస్తి కాస్తూ రక్షణ దళాలు ఉంటాయి. అలా వర్తకం కోసం అలానే రక్షణ కోసం ఇండియన్ నేవీ పనిచేస్తోంది. అలా వర్తకం కోసం పనిచేసే షిప్ లను మర్చంట్ నేవీ అని పిలుస్తారు. అలాంటి నౌకలలో జీవనం ఎలా ఉంటుంది, నెలల తరబడి సముద్రం మీద ప్రయాణం ఎలా అనిపిస్తుందో కెప్టెన్ డేనిస్ దామర్ల వివరించారు.

సముద్రం మధ్యలో మద్యం, సిగరెట్ తాగితే…
కెప్టెన్ డేనిస్ దామర్ల మర్చంట్ షిప్ లో జీవితం గురించి మాట్లాడుతూ కెప్టెన్ గా తాను కుటుంబానికి మూడు నెలలు దూరంగా ఉండవలసి వస్తుందని, అదే షిప్ క్రూ అయితే వారి వారి జాబ్ ర్యాంక్స్ ను బట్టి తొమ్మిది నెలల దాకా కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుందంటూ చెప్పారు. కుటుంబానికి దూరంగా ఉండటం తప్పితే పనిలో కానీ మరే విషయంలో కానీ సముద్రం మీద జీవితం బాగుంటుందంటూ చెప్పారు. ఇక షిప్ లో మూడు రకాల కాపలా ఉంటుంది, మొదటిది షిఫ్ట్ ప్రకారం మూడు షిఫ్ట్లలో రాత్రి 12 నుండి 4 గంటల వరకు మళ్ళీ 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఇక రాత్రి 8 నుండి మళ్ళీ 12 వరకు ఆఫీసర్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇక మ్యాన్డ్ షిప్ అంటే ఇంజిన్ రూంలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఇంజిన్ ఆఫీసర్ ఉంటారు. అన్ మ్యాన్డ్ షిప్ అంటే ఆటోమేషన్ మీద ఆధారపడటం, రాత్రిళ్ళు అలారం శబ్దం మీద ఆధారపడి కాపలా కాయడం. ఇంజిన్ ఆఫీసర్స్ వారి రూమ్ లోనే ఉంటూ అలారం సౌండ్ ద్వారా అలర్ట్ అవుతారు అంటూ చెప్పారు.

ఇక మార్చంట్ షిప్ లో ఫుడ్డు విషయానికి వస్తే అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయని కేవలం సముద్రపు ఆహారం మాత్రమే ఉంటుందని అనుకోవడం అపోహ అంటూ చెప్పారు. ఇక షిప్ లో ఇదివరకు మద్యం, సిగరెట్ అనుమతి ఉండేదని, ఎటువంటి నిబంధనలు ఉండేవి కాదని అయితే తాజాగా వాటిని సవరించి మద్యం మీద ఆంక్షలు కొన్ని మార్చంట్ షిప్స్ మీద ఉంచారంటూ చెప్పారు. మధ్యం ఎక్కువగా సేవించి సరిగా చూసుకోక ఇతర నౌకలను ఢీ కొట్టడం లాంటివి చేస్తే ఎంతో నష్టం జరుగుతుందని ఈ నిబంధనలు ఉంచారు. అయితే టోబాకో ప్రొడక్ట్స్ మీద ఎలాంటి ఆంక్షలు లేవంటూ వివరించారు. షిప్ లో సిగరెట్స్ తాగొచ్చంటూ చెప్పారు.































