Cash Programme : సుమ యాంకర్ గా వ్యవహారిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ లో ఈ వారం సీతారామం టీం సందడి చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో హీరో సుమంత్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో దుల్కర్ సల్మాన్, హనుమాన్ రాఘవపూడి వచ్చి సందడి చేసారు. ఇక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను విడుదల చేసారు. సుమ యాంకరింగ్ ఇక తరుణ్ భాస్కర్, సుమంత్, దుల్కర్, హనుమాన్ ల పుంచులతో బాగా పేలింది క్యాష్ ప్రోగ్రామ్. ఇక ప్రోమో లో ఎక్కువగా దుల్కర్ ను హైలైట్ చేసినట్లుగా అనిపిస్తుంది.

సుమతో డాన్స్ చేసిన దుల్కర్…
మహానటి సినిమాలో ఎమ్జీఆర్ లా నటించిన దుల్కర్ నటనను మరచిపోలేము. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక క్యాష్ ప్రోగ్రామ్ లో సావిత్రి కి లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని దుల్కర్ తో సుమ చేసారు. ఇక డైలాగులాయ్యాక ఇద్దరూ తేనెమనసులు పాటకు డాన్స్ చేయడం అలరించింది. ఇక సుమంత్ చెప్పిన సరదా సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమోషన్స్ చెప్పడం కోసం ఇమోజిస్ వాడతాను అని చెప్పడం తో సుమ మనసులోని ఫీలింగ్స్ అలా చెబుతారా అనగానే సుమంత్ మనసు కూడా బండరాయే అంటూ జోక్ చేసారు.

ఇక ఒక అభిమాని దుల్కర్ ను మీరు మీ భార్యను ఏమని పిలుస్తారు అని అడుగగా జాన్ అంటానని చెబితే సుమ వెంటనే చూసావా రాజా ఎప్పుడైనా నువ్వలా పిలిచావా అంటూ రాజీవ్ ని ఉద్దేశించి జోక్ చేసారు. ఇక ప్రోమో మొత్తం దుల్కర్ ను హైలైట్ చేసారు క్యాష్ ప్రోగ్రామ్ వాళ్ళు. ప్రోమో అంతా ఫన్నీ గా సాగిపోయింది. సీతారామం సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఛానెల్స్ లోనూ అన్ని ప్రోగ్రమస్ కవర్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్నారు.

































