Celebrities who changed religion : ఏ కులంలో ఏ మతంలో మనం పుడుతుసమో అది మనకు తెలియదు. కానీ ఒక వయసు వచ్చాక చుట్టూ ఉన్న సమాజం గురించి అవగాహన వచ్చాక మనకు నచ్చిన మతం స్వీకరించడానికి స్వేచ్చ ఉంది. చాలా మంది తమకు నచ్చిన మతాన్ని పెద్దయ్యాక స్వీకరిస్తారు. ఇది సాధారణ ప్రజల విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయంలోనూ జరుగుతోంది. పుట్టినప్పుడు ఉన్న మతాన్ని కాదని చాలా మంది సెలబ్రిటీలు తమకు నచ్చిన మతాన్ని అవలంభిస్తున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరో తెలుసా…

మతం మార్చుకున్న తారలు…
జయసుధ.. సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జయసుధ పుట్టుకతో హిందూ, కానీ ప్రస్తుతం క్రైస్తవమతాన్ని స్వికరించింది. ఇక ఇలా మరో సీనియర్ హీరోయిన్ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమ మాలిని కూడా మతాన్ని మార్చుకుంది. హేమ మాలిని కూడా హిందూ కానీ పెళ్ళయ్యాక తన భర్తతో కలిసి ముస్లిం లోకి మారిపోయారు. ఇక ఈ కోవలోకే మమతా కులకర్ణి కూడా చెందుతుంది. హిందూ నుండి ముస్లిం లోకి చేరారు. ఇక మరో హీరోయిన్ నగ్మా ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన ఈమె క్రైస్తవ మతాన్ని స్వికరించింది. ఇక మలయాళం సీనియర్ నటి లిజి కూడా క్రైస్తవ మతం నుండి పెళ్లయ్యాక హిందూ మతంలోకి మారింది. మరో సీనియర్ నటి ఖుష్భూ కూడా ముస్లిం ఫ్యామిలీలో పుట్టి, పెళ్లి తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారు. ఇక ఈకోవలో నయనతార కూడా ఉంది. నయన్ స్వాతహాగా క్రైస్తవరాలు అయితే మధ్యలో హిందూ మతాన్ని స్వికరించింది. ఇంకో నటి మోనిక కూడా హిందూ నుండి ముస్లిం కి మారిపోయింది పేరు కూడా రహిమా గా మార్చుకుంది.

సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ కూడా హిందూ మతంలో పుట్టి చిన్న వయసులోనే ముస్లిం మతంలోకి మారాడు. హిందూ గా ఉన్నపుడు తన పేరు దిలీప్ కుమార్. ఇక ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కూడా తన మూడవ వివాహం సమయంలో హిందూ మతం నుండి ఇస్లాం మతాన్ని స్వికరించాడు. హీరో సూర్య భార్య జ్యోతిక కూడా పంజాబీ మతం నుండి హిందూ మతంలోకి మారింది. హీరోయిన్ అయేషా టకీయ కూడా ముస్లిం లోకి మారిపోయింది. సంజన గల్రని కూడా హిందూ నుండి మతం మార్చుకుని ముస్లిం లోకి మారి మహిరా గా పేరు మార్చుకుంది.


































