Chaitanya master mother : డాన్స్ షోలో మాస్టర్ గా ఉంటూ ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు కి చెందిన చావా చైతన్య మాస్టర్ ఆత్మహత్య చెసుకుని మరణించడం టీవీ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ఆర్థిక కారణాలతోనే మరణిస్తున్నట్లు చైతన్య మాస్టర్ వీడియోలో క్లారిటీగా చెప్పినా ఆయన సన్నిహితులు, స్టూడెంట్స్ మాత్రం ఆయన మరణానికి వేరే ఎవరో కారణం అంటూ చెప్పారు. ఆయన ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతారని అనుకోవడం లేదని చెబుతున్నారు. ఇక చైతన్య మాస్టర్ తల్లి కూడా అలాంటి అభిప్రాయాన్నే చెబుతున్నారు. భరించలేని ఆర్థిక ఇబ్బందులు తన కొడుకుకు లేవంటూ చెబుతున్నారు.

తన మరణానికి కారణం అది కాదు…
చైతన్య మాస్టర్ తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు చనిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం అని అందరూ అంటున్నారు కానీ అలాంటిదేమి లేదు. తనకి అన్ని అప్పులు లేవు. ఏవైనా అప్పులు చేసినా తన స్టూడెంట్స్ కోసం చేసాడు. అయితే ఆ అప్పులు కూడా తాను భరించలేనివి కాదు. చైతన్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు.

పోయిన వాడు తిరిగి రాడు కానీ తన మరణంకు కారణం మాత్రం ఆర్థిక ఇబ్బందులని ఎవరూ అనుకోకూడదు అది చెరిపేయాలని అనుకుంటున్నాను అంటూ తెలిపారు. ఇక తన కొడుకు పేరు మీద ట్రస్ట్ పెట్టి తమకు వచ్చే ఆదాయంలో కొంత ఆ ట్రస్ట్ తరుపున చైతన్య స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలని భావిస్తున్నట్లు తన స్టూడెంట్స్ కి సహాయం చేస్తే తన కొడుకు జీవించినట్లే నాకు అనిపిస్తుంది అంటూ తెలిపారు చైతన్య తల్లి.
































