Chandana : తెలుగు బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి, అభిమానులు ఎంతగా ఆదరిస్తారు అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సీరియల్స్ లోని నటీ నటులను బాగా అభిమానిస్తారు. అయితే సీరియల్స్ లో నటించే వారిలో ముఖ్యంగా హీరోయిన్లు తమిళ్, కన్నడ భాష కు చెందిన వాళ్ళు ఎక్కువగా వుంటారు అయినప్పటికీ వారిని మన వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఈ కోవలోకే వస్తారు వరూధిని పరిణయం ఫేమ్ చందన శెట్టి.

తెలంగాణా అబ్బాయిని పెళ్లి చేసుకున్న చందన…
కన్నడలో డబ్బింగ్, యాంకరింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి జీ తెలుగులో ప్రాసరం అయిన ‘వరూధిని పరిణయం’ సీరియల్ ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయింది. చిన్నప్పటినుండి సింగర్ అవ్వాలని వెస్టర్న్, కర్నాటిక్ సంగీతం నేర్చుకున్నా చివరికి యాక్టర్ గా సెటిల్ అయ్యింది. తెలుగు, కన్నడ భాషలలో సీరియల్స్ చేసిన చందన కొన్ని రోజుల కిందట వివాహం చేసుకుంది, అందులోనూ అరేంజ్ మ్యారేజ్ చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది.

వరూధిని పరిణయం సీరియల్ తరువాత వరుసగా దేవయాని, పవిత్ర బంధం, నీలాకుయిల్, జ్యోతి, స్వర్ణప్యాలస్ వంటి సీరియల్స్ చేసింది. అయితే పెళ్లి తరువాత ప్రస్తుతం భర్తతో కలసి యూఎస్ లో ఉంటోంది చందన. తాజాగా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. అభిమానులతో మాట్లాడిన చందన తనతో పాటు తన భర్త పేరు అనిల్ అని అతను పక్కా తెలంగాణ అబ్బాయి అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.































