Character artist Pramila Rani : పిల్లలు పుట్టరని మొదటి భర్త వదిలేసాడు… రెండో భర్త మోసం చేసాడు…: నటి ప్రమీల రాణి

0
221

Character artist Pramila Rani : దాదాపు 85 కు పైగా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకున్న నటి ప్రమీల గారు. బాహుబలి బామ్మాగా మంచి గుర్తింపు అందుకున్న ప్రమీల గారు మొదట వద్దు బావ తప్పు, రియల్ పోలీస్, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు, వేదం, బాహుబలి, విక్రమార్కుడు, చలో ఇలా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా వేదం, బాహుబలి సినిమాల్లో గుర్తింపు అందుకున్న ఆమె తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

రెండు పెళ్లిళ్లు విఫలం అయ్యాయి…

ఆరుపదుల వయసులో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తున్న ప్రమీల రాణి గారు నాటక రంగం నుండి వచ్చారు. ఆమెకు చిన్నతనం నుండి అస్తమాతో పాటు ఆయాసం కి సంబంధించిన వ్యాధి ఉండటం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారట. దీంతో మొదట పెళ్లి చేసుకున్న భర్త పిల్లలు పుట్టరని విడాకులు తీసుకుని వదిలేసారట. ఇక రెండో వివాహం నాటక రంగంకు చెందిన వ్యక్తిని ప్రేమించి చేసుకున్న ప్రమీల గారు అతను మోసం చేసాడని తన గురించి తన కుటుంబం గురించి అపద్ధాలు చెప్పడంతో ఇక అతడితో ఉండకూడదని విడిపోయినట్లు చెప్పారు.

అప్పటికి పిల్లలు పుట్టరని అనుకుంటే పుట్టారని, వాళ్ళలో ఒక మగ పిల్లాడిని తీసుకుని నేను హైదరాబాద్ వచ్చి బుల్లతెర, వెండి తెర మీద అవకాశాల కోసం ప్రయత్నించానని, నా వైవహిక జీవితం గురించి ఎక్కువగా మాట్లాడనని చెప్పారు. కొందరు పెద్దలు అలాగే నా సన్నిహితులు మాట్లాడవద్దని చెప్పినట్లు చెప్పారు. తన పిల్లలకు ఇటువంటి విషయాలు ఇబ్బందికరంగానే ఉంటాయని నేను ఎక్కువగా మాట్లాడనని తెలిపారు ప్రమీల.