Character artist Pramila Rani : మోసపోయాను… లక్షల డబ్బులు కాజేశారు…: నటి ప్రమీల రాణి

0
178

Character artist Pramila Rani : దాదాపు 85 కు పైగా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకున్న నటి ప్రమీల గారు. బాహుబలి బామ్మ గా మంచి గుర్తింపు అందుకున్న ప్రమీల గారు మొదట వద్దు బావ తప్పు, రియల్ పోలీస్, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు, వేదం, బాహుబలి, విక్రమార్కుడు, చలో ఇలా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా వేదం, బాహుబలి సినిమాల్లో గుర్తింపు అందుకున్న ఆమె తాజగా ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

లక్షల్లో డబ్బు మోసపోయాను…

ప్రమీల గారు పిల్లలతో హైదరాబాద్ వచ్చి నాటక రంగంలో ఉన్న అనుభవంతో సినిమా, టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఒక వైపు టీవీలో నటిస్తూనే మరోవైపు డబ్బింగ్స్ చెబుతూ మరోవైపు సినిమాల్లో చిన్నవేషమైనా నటించారు. అలా ఉన్న ప్రమీల గారికి ఒక సహచర నటి విజయ రాణి ఆమె 15 లక్షల డబ్బు తీసుకుని ఎగొట్టి బెంగళూరు వెళ్ళిపోయింది, ఆపైన పోలీసులు మళ్ళీ హైదరాబాద్ తీసుకురాగా తాను ఇప్పటికీ డబ్బు కట్టలేదు.

మనకు ప్రాప్తం ఉంటే డబ్బు వస్తుంది లేకుంటే లేదు అని ఇక వదిలేసాను అంటూ చెప్పారు. ఇక ఇల్లు విషయంలోనూ చిన్న చిన్న గొడవలు జరిగాయి. మా అమ్మమ్మ గారిది పెద్ద కుటుంబం కాగా అక్కడ నా వాటా గా వచ్చిన పొలం నాకు తెలియకుండా మా మేనమామ అమ్మేసుకున్నాడు. ఇలా చాలానే నష్టపోయాను అంటూ చెప్పారు. చనిపోయే వరకు నటిస్తూనే ఉంటానని చెప్పారు ప్రమీల.