Character artist Sudha : సెట్ లో అందరి ముందు నన్ను బూతులు తిట్టాడు… కోటి రూపాయలు ఇచ్చినా అతని సినిమా నేను చేయనని చెప్పా…: నటి సుధ

0
166

Character artist Sudha : తమిళనాడులో జన్మించినా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు సుధ. ఆమె అసలు పేరు హేమ సుధ. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినా ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించిన సుధ తెలుగులో చాలా మంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించారు. తన కెరీర్ కి సమబంధించిన అటుపోట్లతో పాటు ఎదురైన అవమానాలను కూడా ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అందరి ముందు తిట్టాడు…

తన సినిమా కెరీర్ తమిళంలో మొదలు పెట్టిన సుధ గారు అక్కడ వదిన, అక్క పాత్రలలో ఎక్కువగా నటించారు. అలా నటిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తెలుగులో ‘ముద్దుల మావయ్య’ గా వచ్చిన తమిళ మాతృక సినిమా ‘ఎన్ తంగచి పడిచావా’ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక పాటలో చిన్న మూమెంట్ సరిగా చేయలేక పోయినందుకు సుందరం మాస్టారు నువ్వు ప్రొస్టిట్యూషన్ కి కూడా పనికి రావు అంటూ అందరి ముందు తిట్టారట. అందరి ముందు తిట్టేసరికి ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది.

ఇక ఆయన కోటి రూపాయలు ఇచ్చినా మళ్ళీ సినిమా చేయకూడదనుకున్నాను, కానీ మా అమ్మ మళ్ళీ ఆయన సినిమాలో అవకాశం వచ్చినపుడు చేయి ఎవరైతే నిన్ను తిట్టారో ఆయనే మళ్ళీ తెలుసుకోవాలి నీ గురించి అని చెప్తే మళ్ళీ ఆయన డైరెక్షన్ లోనే సినిమాలో నటించినపుడు ఆయన సారీ చెప్పి చాలా బాగా నటిస్తున్నారు అని చెప్పారు అంటూ అప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు.