Charecter artist Hema : తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగ్స్ వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. ఇక హేమ ఎవరి గురించైనా ఏ మాత్రం జంకు లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది. ఇక తాను నటించిన సీనియర్ హీరోల గురించి మాట్లాడుతూ బాలయ్య బాబు గొప్పతనం గురించి చెప్పింధి హేమ.

మెసేజ్ కే స్పందించి డాక్టర్లను పంపారు…
బాలయ్య బాబు భోళా మనిషి, మనసులో ఏదీ ఉంచుకోరు అంటూ హేమ చెబుతూ ఆయనతో నేను సెట్లో ఉన్నానంటే జోక్స్ వేసుకుంటూ నవ్వుతూనే ఉంటాం అంటూ చెప్పారు. మా ఎలక్షన్ అపుడు కూడా నాకు, శ్రీకాంత్ కు ఓటు వేసానని ఆయన చెప్పారు. అంత పెద్ద హీరో అయినా చాలా ఫ్రెండ్లీగా అందరితో ఉంటారు అంటూ చెప్పారు.

ఇక ఆయన మంచితనం గురించి చెబుతూ తన ఊరిలో తెలిసిన వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందని వైద్యం కోసం సహాయం కావాలని కేవలం మెసేజ్ చేయగానే బాలకృష్ణ గారు మరుసటి రోజు పదిమంది డాక్టర్లను వాళ్ళ ఊరికి పంపి ఆయనకు ఏ వైద్యం చేయించాలో చెప్పి హైదరాబాద్ లో చికిత్స చేయించారట బాలకృష్ణ. ఒక మెసేజ్ కే ఆయన స్పందిస్తారని అనుకోలేదు అంటూ ఆయన చాలా మంచి మనిషి అంటూ తెలిపారు.






























