Charecter Artist Sudha : తెలుగులో తల్లిగా, అక్కగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రలు చేసి ఎన్నో సినిమాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ తమిళ నాడుకి చెందినవారు. కానీ తెలుగులో 500 పైగా సినిమాల్లో నటించిన సుధ గారు తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. మనం ఇంట్లో అమ్మ, అత్త వంటి పాత్రల్లో మన ఇంటి మనిషిలాగ ఒదిగిపోయి నటించిన సుధ గారు ఇప్పటికి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇక ఆమెకు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మందితో మంచి అనుబంధం ఉంది. అయితే హీరో ఉదయ్ కిరణ్ తో మంచి అనుబంధం ఉంది.

దత్తత తీసుకొని, ఆస్తి ఇవ్వాలనుకునే లోపే…
ఉదయ్ కిరణ్ తో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్న సుధాగారు, ఉదయ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ తల్లి మరణించడం, ఆ తరువాత తండ్రి దూరం అవ్వడం ఇక సినిమాలు పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి సినిమా షూటింగ్ సమయంలో నేను చలపతి గారు కూర్చొని ఉన్నపుడు డ్రెస్సింగ్ రూంలోకి వచ్చి తన బాధను చెప్పుకుని కాళ్ళ దగ్గరే కూర్చొని ఏడ్చేసాడు. నేను, చలపతి గారు ఇద్దరం ఓదార్చాం, అన్ని సర్దుకుంటాయని ఆ రోజు సర్ది చెప్పాం. నేను రెగ్యులర్ గా ఉదయ్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని, లీగల్ గా దత్తత తీసుకోడానికి కోర్ట్ పర్మిషన్ కి కూడా అప్లై చేశాను.

ఇంకొన్ని రోజుల్లో పర్మిషన్ వచ్చేది దత్తత తీసుకుని ఆస్తి ఇచ్చి తనకు అమ్మగా ఉండేదానిని అంటూ బాధపడ్డారు. తాను ఆత్మహత్య చేసుకునే కొద్ది రోజులు ముందు నుండి నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, నా కూతురుతో కూడా మాట్లాడకుండా అవాయిడ్ చేసాడు. ఇలా జరుగుతుందని అనుకుని ఉంటే వెళ్లి కూర్చొని మాట్లాడుందే దాన్ని. తన పెళ్ళికి నేను వెళ్ళలేదు నాకెందుకో ఆ అమ్మాయి ఉదయ్ కిరణ్ కి కరెక్ట్ కాదని అనిపించింది. ఇక తాను చనిపోవాలని అనుకున్నపుడు ఒకసారి ఎందుకు చనిపోవాలి అని అలోచించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు.































