Featured

Child artist Sahasra : బాలకృష్ణ చెల్లి పెద్దయ్యాక ఎలా ఉందో తెలుసా… సినిమాలకు దూరమైన ఆమె ఇపుడు ఏం చేస్తోందంటే…!

Child artist Sahasra : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమర సింహా రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సహస్ర గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి సహస్ర గుర్తుందా. ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్లు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన సహస్ర ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అందులో ఫ్యాక్షన్ ఎంత ఆకట్టుకుందో అంతే ఎఫెక్ట్ ఇలాంటి సెటిమెంట్ సీన్స్ కూడా అలరించాయి. అయితే ఆ సినిమాలో నటించిన సహస్ర ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.

పెద్ద హీరోలతో నటించిన సహస్ర…

ఎన్టీఆర్, కృష్ణం రాజు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి పెద్ద హీరోలతో నటించిన సహస్ర కు భాను చందర్ గారి సినిమా ‘ఉద్యమం’ మొదటి సినిమా కాగా, మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ తో పాటు కలిసి నటించింది. మనోజ్ తో పాటు షూటింగ్ కి కలిసి వచ్చేదట సహస్ర. చిన్న పిల్ల అని అందరూ ముద్దు చేసేవారట. ఇక హిట్లర్ లో నటించడం వల్ల చిరంజీవి గారితోను అనుబంధం ఉందని అలాగే రామ్ చరణ్ బొమ్మలతొ ఆడుకునేదాన్ని చెన్నైలో వాళ్ళింట్లో అంటూ తెలిపారు సహస్ర.

తన కోసం రామ్ చరణ్ ఉప్మా కూడా చేసిపెట్టాడని ఆ మధురానుభూతులను మర్చిపోలేనని తెలిపారు. ఇక సమర సింహా రెడ్డి సినిమా తరువాత సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఇక చేయలేదని చదువు మీద ఇంట్రస్ట్ తో చదువు డిస్టర్బ్ కాకూడదని యాక్టింగ్ మానేసినట్లు తెలిపారు. మాస్టర్స్ యిన్ బయోటెక్నాలజీ చేసిన సహస్ర ప్రస్తుతం సొంత వ్యాపారంలో ఉన్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ కాస్త బోద్దుగా తయారైనా క్యూట్ మాటలతో తన కెరీర్ అలాగే అప్పట్లో హీరోలతో తాను ఆడుకున్నది వంటి విషయాలను పంచుకుంది.

Bhargavi

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

13 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

14 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

14 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

1 day ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

1 day ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

1 day ago