Child Artist Shresta : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమర సింహ రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహ రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి శ్రేష్ఠ . ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్ల్లు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన శ్రేష్ఠ ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అందులో ఫ్యాక్షన్ ఎంత ఆకట్టుకుందో అంతే ఎఫెక్ట్ ఇలాంటి సెటిమెంట్ సీన్స్ కూడా అలరించాయి. అయితే ఆ సినిమాలో నటించిన శ్రేష్ఠ ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.

ఎన్టీఆర్ గారితో జ్ఞాపకాలు ఎప్పటికి మరువను….
మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారి మనవరాలిగా చేసిన బేబీ శ్రేష్ఠ ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా బాగా ఎంజాయ్ చేసానంటూ చెప్పారు. ఎన్టీఆర్ గారితో మంచి మెమోరీస్ ఉన్నాయంటూ చెప్పిన శ్రేష్ఠ ఆయనతో కలిసి భోజనము చేసిన విషయాలను పంచుకున్నారు. మేజర్ చంద్రకాంత్ సినిమా అయ్యాక రెండో సారి సీఎం అయిన ఎన్టీఆర్ గారు మొదట తననే ఇంటికి భోజనానికి ఆహ్వానించారని అది ఎప్పటికి మర్చిపోలేను అంటూ చెప్పారు.

ఆ సమయంలో ఇంట్లో ఎన్టీఆర్ గారు, లక్ష్మి పార్వతీగారు మాత్రమే ఉన్నారని భోజనము అయ్యాక బయటికి వచ్చి చూస్తే కేబినెట్ మంత్రులందరు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. నేను బయటికి రాగానే బుడ్డదాన నీకోసం మమల్ని వెయిట్ చేయించారా అని సరదాగా అన్నారు. అంతటి లెజెండ్రీ నటుడితో పనిచేయడమే కాకుండా నన్ను గుర్తుంచుకుని భోజనముకి పిలిచి నాతో సమయం గడపడం చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్ లో మర్చిపోలేను అంటూ శ్రేష్ఠ తెలిపారు.






























