Child complaint in police station : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వల్ల ఎంతోమంది చిన్నారుల ఆకలి తీరుతుంది. ప్రభుత్వం సక్రమంగా రేషన్ విడుదల చేస్తున్న మద్యాహ్న భోజన పథకం అమలులో మాత్రం అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం పెట్టే అన్నం లో పురుగులు ఉంటున్నాయి అంటూ ఒక తోమ్మిదేళ్ల పాప పోలీస్ స్టేషన్ కి పోయి ధైర్యంగా కంప్లెయింట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అన్నం లో పురుగులు…. అడిగితే తిట్లు….
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, మీర్ పేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న తొమ్మిది ఏళ్ళ చిన్నారి పూజిత రోజు అక్కడే మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం తింటుంది. అయితే అన్నంలో పురుగులు రావడం కూరలు కూడా సరిగా లేకపోవడంతో అక్కడ తినడం మానేసి ఇంట్లో తినేది. అయితే అక్కడ అభోజనం చేయకపోతే టీచర్స్ తిట్టేవారట.

అన్నం లో పురుగులు వస్తున్నాయని చెప్పినా స్కూల్ హెడ్ మాస్టర్ పట్టించుకోకపోవడంతో తన తల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్ లో నేరుగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వికరించిన పోలీసులు పాఠశాలలో తనిఖీ చేసి బియ్యం, కూరలు పరిశీలించి శాంపిల్స్ తీసుకెళ్లారు. ఎంతో నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన పూజిత అసలు ఎలా నీకు ఆలోచన వచ్చిందని అడిగితే మనకు ఏదైనా సమస్య వస్తే పోలీసులు పరిష్కరిస్తారని తెలుసంటూ సమాధానము ఇచ్చింది.































