Chiranjeevi : కొణిదెల, అల్లు ఫ్యామిలీలు వియ్యంకులే కాకుండా బిజినెస్ లోనూ కలిసి పని చేస్తూ మంచి అనుబంధం కలిగివున్నాయి. అల్లు రామలింగయ్య గారు లెజెండరి నటులు, ఆయన తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇక ఆయన తన కూతురుని చిరంజీవి కి ఇచ్చి చేయడం అల్లు, కొణిదెల ఫ్యామిలీ మధ్య బంధానికి బీజం వేసింది. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా అందరూ కలిసి ఉన్నా, ఎవరి వ్యాపారాలు, ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నా వాలింట్లో ఏదైనా వేడుక అంటే అందరూ కలిసి చేసుకుంటారు. ఇక అల్లు అరవింద్ గారు సినిమా నిర్మాణం రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. గీత ఆర్ట్స్ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. చిరంజీవి హీరోగా ఎన్నో సినిమాలను చేసారు. ఇక అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ హీరోగా అగ్ర స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున హీరోగా ఎంట్రీ ఇచ్చినపుడు మెగాస్టార్ అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఘనంగా అల్లు స్టూడియో…
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ తో ఉన్నాడు. ఇక ఇటీవలే మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చినా వాటిపై ఇరు కుటుంబాలు స్పందించలేదు కానీ ఇప్పుడు అల్లు రామలింగయ్య శత దినోత్సవాలు అలాగే అల్లు స్టూడియో ఓపెనింగ్ లో చిరంజీవి పాల్గొనడం వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పినట్లయింది.

అల్లు స్టూడియోను కొకాపేట లో హైదరాబాద్ కు కొంచె దూరంగా క్రితం ఏడాది నిర్మించడం ప్రారంభించారు. ఇప్పుడు అల్లు స్టూడియో ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా అల్లు ఫ్యామిలీ సెలెబ్రేట్ చేసింది. అల్లు ఫ్యామిలీ లో అల్లు అరవింద్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్య అతిధి గా చిరంజీవి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారు అల్లు ఫ్యామిలీ విజయానికి పాలకొల్లు లోనే భీజం వేశారు. ఈనాడు కొడుకు, మనవళ్ళు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయనే. అల్లు కుటుంబం లో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను అంటూ చెప్పారు. అల్లు స్టూడియో లో సకల సదుపాయాలు, అదునాతన టెక్నాలజీ అందుబాటులో ఉండనున్నాయి. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ఈ స్టూడియో లోనే జరగనుంది.



























