Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి భయపడిన సంఘటనను ఇటీవల పంచుకున్నారు. మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే చూడాలని దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మందే ఉంటారు. మరి అలాంటి మెగాస్టార్ కూడా ఫస్ట్ డే సినిమా చూడాలని వెళ్లి తన తండ్రి చేతుల్లో దెబ్బలు తిన్న సంగతి గురించి ఇటీవల ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. ఆ ఈవెంట్ కు ముఖ్య అతిధి గా వచ్చిన చిరు సినిమా లో నటించిన వారికి మంచి కెరీర్ ఉండాలని ఆకాంక్షించారు.
Advertisement
రాము సినిమా చూడటానికి మొదటి ఆటకు వెళితే…
ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరావు గారి మనవరాలు శ్రీజ అవ్వడంతో ఆమె కోసం చిరు ఈ ఈవెంట్ కి వచ్చారు. ఏడిద నాగేశ్వరావు గారు నాకు ఆప్తులు, ఆయన కుటుంబం లో వ్యక్తిలా నన్ను చూస్తారు, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా ఈ ఈవెంట్ కి వచ్చానని చెప్పారు. ఇక ఇండస్ట్రీ లో నిర్మాతలుగా అమ్మాయిలు రావడం చాలా అవసరమని చెప్పారు. మా ఇంటినుండి నిహారిక సుస్మిత ను మేము ప్రోత్సాహిస్తున్నాము, శ్రీజ కూడా నిర్మాత్తగా మంచి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇక సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు తో పాటు డైరెక్టర్స్ వంశీధర్, లక్ష్మి నారాయణలకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక యాంకర్ సుమ మీ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాలేమైనా ఉన్నాయా అని చిరంజీవిని అడుగగా… ఆయన ‘రాము’ సినిమా చూడటానికి తన బంధువుల అబ్బాయితో కలిసి వెళ్లిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. నెల్లూరు లో ఉండే సమయంలో మా చుట్టాలబ్బాయి పూర్ణ అనే అబ్బాయి ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో నన్ను నాగబాబుని రాము సినిమాకు తీసుకెళ్లాడు. మమ్మల్ని ఎప్పుడు నాన్న కుర్చీ టికెట్ కి కూర్చోబెట్టి సినిమాలు చూపించేవారు. అయితే పూర్ణ నేల టికెట్ తీసుకుని సినిమా చూసేవాడు. అలా మొదటి సారి నేల టికెట్ తీసుకుని వాడితో నాగబాబు ని తీసుకుని సినిమాకు వెళ్ళాము.
అక్కడ క్యు మధ్యలో ఆగిపోయింది చీకటి గోడలమధ్య లో ఆగిపోయాం. అప్పటికే మాకు ఊపిరి ఆడటం లేదు లాభం లేదని బయటికి వచ్చేసాం. అంతలో ఎదురుగా మా నాన్న మా అమ్మతో పాటు సినిమా చూసి బయటికి వచ్చారు. మమ్మల్ని అక్కడ చూసి అప్పటికే చమటలు పట్టి బిక్కమొహం వేసుకుని చూస్తున్న వాడిని చూసి థియేటర్ స్థంబాలకు కట్టి కొబ్బరి మట్ట విరుచుకుని జనంలో ఊపిరి ఆడక వాడు చనిపోతే ఏంటి పరిస్థితి అంటూ నన్ను చితక్కొట్టుడు కొట్టాడు, ఆరోజును మరచిపోలేను. అప్పటి నుండి రాము సినిమా ఆనగానే ఇంకా ఆ భయం అలాగే గుర్తుంది అంటూ అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
Rana: ఇటీవల రవితేజ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.
Advertisement
ఇక ఈ సినిమా డిజాస్టర్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా జోకులు వేశారు. రానాతో పాటు ఈ కార్యక్రమానికి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సరదా సరదాగా పలు సినిమాల గురించి మాట్లాడారు.
బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై చూశారు లోయస్ట్ లో చూశారు అని రానా అంటే హైయెస్ట్ అయితే కల్కి మరి లోయస్ట్ లో ఏమిటి అని అడిగితే అదే ఈ మధ్య వచ్చింది కదా మిస్టర్ అంటూ ఉండగా తేజా సజ్జ ఏ అలా మాట్లాడొద్దు అంటూ ఆపారు. అయితే ఇక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి పూర్తిగా చెప్పకపోయినా మిస్టర్ అని చెప్పడంతో కచ్చితంగా రవితేజ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడారని తెలుస్తుంది.
అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఇక ఈ విషయంపై రవితేజ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అన్న ఎవరైతే ఇలా మీ సినిమాల గురించి మాట్లాడారో వారే క్లాప్స్ కొట్టాలి అంటే మీరు కచ్చితంగా హిట్ సినిమా చేయాలి అంటూ కామెంట్ చేయగా మరికొందరు డైరెక్టర్ హరీష్ శంకర్ ని టాగ్ చేశారు. రవితేజ గారితో ఒక సినిమా చేయాలి మళ్లీ మేము కాలర్ ఎగరేయాలి దీనికి మీ రిప్లై కావాలన్నా అంటూ పేర్కొన్నారు. దానికి హరీష్ శంకర్ ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదోటి. అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ఎవరికైనా అంటూ రాసుకొచ్చారు.
Sai pallavi: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
Advertisement
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సరికొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని లేడీ పవర్ స్టార్ అనే బిరుదులతో పిలుస్తారు తాజాగా బాక్సాఫీస్ క్వీన్ అంటూ మరో బిరుదుని ఇచ్చారు.
సాయి పల్లవి సినిమా సెట్ లో ఉంటే కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా నా పాత్ర గురించి కూడా ఎంతో క్లారిటీతో ఉంటూ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. ఇక సాయి పల్లవి తో నటించాలన్న కాస్త కష్టంగా ఉంటుంది.ఆమెతో కలిసి డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం వేస్తుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా సాయి పల్లవి నటన డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
డాన్స్ చేయాలంటే భయం.. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశానని అన్నారు. ఈ సినిమా జాలరి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి తెలిసిందే.
Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఏడో తేదీ విడుదలకు సిద్ధమైంది.
Advertisement
ఇలా విడుదల తేదీన ప్రకటించడం కోసం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. ఇటీవల సాయి పల్లవి అమరన్ సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇటీవల తాను అమరన్ సినిమా చూశాను. సాయి పల్లవి తన నటనతో అందరిని అదరగొట్టేసింది. చివరిగా కన్నీళ్ళతో బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చాను కారులో కూర్చుని అదే ఎమోషన్ లో సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు.
కూతురితో సమానం.. నాకు కూతుర్లు లేరు కూతురు కనుక ఉండి ఉంటే సాయి పల్లవి లాగే ఉండాలని కోరుకుంటాను ఆమె నాకు కూతురుతో సమానం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయ్యయ్యో ఈ స్టార్ హీరోయిన్ పట్టుకొని బన్నీకి చెల్లిని చేశారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు