Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక చిన్న మొలకగా మొదలై నేడు ఒక మహా వృక్షం లాగా ఎదిగాడు. ఆయన ఏంతోమంది నేటి యువ నటులకు స్ఫూర్తి అని ఎంతో మంది చెబుతుంటారు. ఇక అలాంటి ఆయన కుటుంబం నుండి కూడా ఒక అరడజనుకు పైనే హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన పేరు, ఆశీస్సులతో మెగాస్టార్ కాంపౌండ్ నుండి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. ఇక అలా వచ్చిన ఒక మెగా హీరో ఒక పోరంబోకు పని చేసి బాగా చివాట్లు తిన్నాడట. ఏకంగా కొట్టించుకునే వరకూ వెళ్ళాడట. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

డ్రగ్స్ తో సహవాసం…
మెగాస్టార్ ఎపుడూ నవ్వుతూ అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఏనాడూ ఒకరిపై కోప్పడిన చిరాకుపడిన సందర్భాలు కనిపించవు. అలాంటి వ్యక్తి ఏకంగా చేయి చేసుకునే వరకు వెళ్ళాడంటే విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది. ఇపుడిపుడే సినిమాల్లోకి వస్తున్న ఒక మెగా హీరో సినిమాల్లోకి వచ్చాడో లేదో డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడట. ఇక బాగా డ్రగ్స్ అలవాటు పడిన ఆ హీరోను దారిలో పెట్టాలని చిరు కూర్చోపెట్టుకుని నాలుగు మంచి మాటలు చెప్పినా పద్ధతి మార్చుకోలేదట.

దీంతో ఒకరోజు పిలిచి కోపం తో జీవితం పాడు చేసుకుంటావు అని కొట్టడానికి చేయి ఎత్తేసరికి అక్కడే ఉన్న సురేఖ గారు అది చూసి ఏడ్చేశారట. వెంటనే పిల్లాడిని కొడతారా అని ఆ కుర్ర హీరోను లోపలికి తీసుకెళ్లి అలా చేయొద్ధంటూ చెప్పడం తో ఆ మెగా హీరో పద్ధతి మార్చుకుని ప్రస్తుతం బుద్దిగా ఉంటూ సినిమాలు చేస్తున్నాడంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.































