Chiranjeevi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఈయన యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈయన సంపాదన మొత్తం ఫిలింనగర్ చుట్టూ భారీగా ఆస్తులను కొనుగోలు చేశారని సమాచారం.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్న ఈ ప్రాపర్టీస్ ప్రస్తుతం కొన్ని వందల కోట్లు విలువ చేస్తున్నాయని తెలుస్తోంది. ఇలా వందల, వేలకోట్ల ఆస్తిపాస్తులు సంపాదించిన చిరంజీవి తాజాగా ఓ ఖరీదైన ప్రాపర్టీని అమ్మినట్టు సమాచారం.
ఫిలింనగర్లోని మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి ఈయన ఓ ఖరీదైన ఫ్లాట్ ను అమ్మారనీ తెలుస్తోంది. అయితే చిరంజీవి ఈ ఆస్తిను అమ్ముకోవడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే చిరంజీవి ఈ ఫ్లాట్ అమ్మడం తనకి ఇష్టం లేకపోయినా ఒక దినపత్రిక యజమాని ఈ ఫ్లాట్ తనకు విక్రయించాలని చిరంజీవి గారిపై ఒత్తిడి తేవడంతోనే ఆయన అమ్మినట్టు తెలుస్తోంది.
ఈ స్థలంలో అయితే దినపత్రిక కార్యాలయం నిర్మించడానికి చాలా అనుకూలంగా ఉందన్న ఉద్దేశంతో ఆ యజమాని చిరంజీవిపై ఒత్తిడి తీసుకురావడంతోనే మెగాస్టార్ ఖరీదైన ప్రాపర్టీని అమ్మినట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఆ ఫ్లాట్ అప్పట్లో 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారట. అయితే ప్రస్తుతం దానిని కాస్త అటు ఇటుగా 70 కోట్లకు పైగా అమ్మినట్టు వార్తలు వస్తున్నాయి. మరి చిరంజీవి ప్రాపర్టీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…