Chiranjeevi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తుంది. వైసీపీ మంత్రి రోజా మెగా బ్రదర్ నాగబాబు మధ్య జరిగినటువంటి వివాదం గురించి మనకు తెలిసిందే.మెగా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రాజకీయాలలో కొనసాగారు. అయితే ఈ ముగ్గురు కూడా రాజకీయాలలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి రోజా మాట్లాడుతూ చిరంజీవి ఎప్పుడైనా పేదలకు దానధర్మాలు సహాయ సహకారాలు చేస్తేనే కదా వారిని ప్రజలు ఆదరించేది అందుకే వారి సొంత జిల్లాలోనే ఓడిపోయారు అంటూ కామెంట్లు చేశారు.ఇక రోజా వ్యాఖ్యలపై నాగబాబు స్పందించడం నాగబాబుకు తిరిగి రోజా కౌంటర్ ఇవ్వడం జరిగింది కానీ ఈ విషయంపై చిరంజీవి ఇంతవరకు స్పందించలేదు.
ఈ క్రమంలోనే మొదటిసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ విషయంపై స్పందించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ నేను బ్లడ్ బ్యాంక్ పెట్టాను, ఐ బ్యాంక్ పెట్టాను, కరోనా సమయంలో ఎంతో మంది సినీ కార్మికులకు సహాయం చేశాను. ఇవన్నీ కూడా నా హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు నిదర్శనం.
ఒకవేళ రోజా చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెబితే నా స్థాయిని నేనే తగ్గించుకున్న వాడిని అవుతా. ఆమె నాతో పాటు నటించారు. నాతో పాటు సెంటిమెంట్ పంచుకున్నారు, మా ఇంటికి వచ్చి సొంత మనుషుల్లా కలిసిపోయి భోజనం చేయడం ఇంట్లో తిరగడం చేశారు. వాళ్లు వారి మెంటాలిటీ, నైజం ప్రకారం మాట్లాడితే నేను స్పందించేసి మాట్లాడటం నా నైజం కాదు. వారు ఏం మాట్లాడినా దానిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ చిరంజీవి రోజా వ్యాఖ్యలపై స్పందించి కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…