Chiranjeevi & Vijayashanthi : తొంబైలలో అగ్ర హీరోగా ఉండి తనకంటూ మాస్ ఇమేజ్ సొంతం చేసుకుని సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినిమాల్లో ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్. అయితే చిరు తో కొంతంది హీరోయిన్స్ పెయిర్ గా మంచి హిట్లు ఉన్నాయి. అలాంటి వారిలో రాధ, విజయశాంతి, రాధిక ముందుంటారు. మరీ ముఖ్యంగా విజయశాంతి, చిరు పెయిర్ కి అప్పట్లో క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. దాదాపు ఇద్దరూ కలిసి 19 సినిమాల్లో నటిస్తే ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి సినిమాల్లో ఇండస్తీ హిట్లు, సూపర్ హిట్లుగా ఉన్న సినిమాలు ఇవే..

సంఘర్షణ తో మొదలై… సూపర్ హిట్ పెయిర్ గా…
చిరంజీవి, విజయశాంతి జంటగా తొలిసారి జతకట్టిన సినిమా ‘సంఘర్షణ’, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబో లో కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘ఛాలెంజ్’ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన కొండవీటి రాజా, పసివాడి ప్రాణం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కే విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ‘స్వయంకృషి’ సినిమా చిరంజీవి, విజయశాంతి జోడి ఖాతాలో మరో హిట్ ను నమోదు చేసింది.

అంతే కాకుండా చిరు కి మొదటి నంది అవార్డు ను అందించింది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఆ తరువాత వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ పరవాలేదానిపించినా ‘కొండవీరి దొంగ’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ హిట్ జోడి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం చూసాం. ఇక విజయ శాంతి చిరు కే కాకుండా మరో అగ్ర హీరో బాలకృష్ణ కూడా హిట్ పెయిర్ గా నిలిచింది.



































