Chiranjeevi Vs Garikapati : చిరంజీవితో ఒకసారి మాట్లాడమంటూ కోరిన అభిమాని… సానుకూలంగా స్పందించిన గరికపాటి… వివాదం ముగిసినట్లేనా…!

0
115

Chiranjeevi Vs Garikapati : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలయ్ నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఈ ఏడాది కూడా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో అలాయ్ బలయ్ నిర్వహించారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చూసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. రాకరాక మెగాస్టార్ రావడంతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఫోటో దిగాలని ఎవరికి ఉండదు అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు.

చిరు తో మాట్లాడుతానన్న గరికపాటి…

మీరు ఫోటో సెషన్ ఆపేస్తే నేను ప్రవచనాలు చెబుతాను లేకుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటూ చెప్పడం తో మెగా అభిమానులకు కోపం వచ్చింది. చిరంజీవి గారు ఆయన అసహనానికి చిరాకు పడకుండా ఫోటోసెషన్ ఆపి ఆయనకు శిరసు వంచి నమస్కారం చేసారు. దీనికి మెగా అభిమానులు గరికపాటిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. శిఖరం లాంటి వ్యక్తి మీముందు శిరసు వంచితే అహంకారంతో మాట్లాడుతావా అంటూ గరికపాటిని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి గరికపాటి గారు ఇంతకుముందు కూడా ఇలానే కొందరు సెల్ఫీలంటూ ఫోటో షూట్ చేసేవాళ్ళను అలానే అన్నారు. కానీ ఇక్కడ మెగాస్టార్ అవ్వడం వల్ల మెగా అభిమాల మనసు చివుకుమంది.

ఇక ట్రోల్ల్స్ తో ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరేత్తిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకొంచం ముదరకూడదనే ఉదేశంతో మెగా అభిమాని ఒకరు చొరవ తీసుకుని గరికపాటి గారికి ఫోన్ చేసి మెగాస్టార్ తో మాట్లాడమని అడిగారు. దీనికి గరికపాటి గారు కూడా సానుకూలంగా స్పందించడం వల్ల గొడవ ఇక్కడే సమసినట్లే అనిపిస్తోంది. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ స్వయంగా గరికపాటి నరసింహారావుకి కాల్ చేసి మాట్లాడారు. చిరంజీవి గారిని అలా మాట్లాడినందుకు మెగా అభిమానులు బాధపడుతున్నారు వారి కోపాన్ని ఖచ్చితంగా చల్లభరుస్తాము కానీ మీరు చొరవ తీసుకుని మెగాస్టార్ తో మాట్లాడండి అంటూ కోరడంతో గరికపాటి గారు కూడా సానుకులంగా స్పందించడం తో గొడవ సమసిపోయినట్లే.