అటు మా ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ అక్కడికి వెళ్లి ఓటు హక్కును నియోగించుకుంటున్నారు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నం అయ్యారు. ఇటు వైపు హీరో శ్రీకాంత్ తనయుడు నటించిన పెళ్లిసందD సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.
అందులోనే శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా పెళ్లి సందడి విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందులోనే ఆ సిల్వర్ జూబ్లి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అంతక ముందే ఈ ఫంక్షన్ కు హీరో వెంకటేష్ వచ్చి కూర్చొని ఈవెంట్ ను వీక్షిస్తున్నాడు. తర్వాత కొంత సమయానికి చిరంజీవీ హాజరయ్యారు. అందరు పెళ్లిసందD సినిమా గురించి మాట్లాడారు.
అందులో రోషన్ కూడా మాట్లాడారు. అతడు చిరంజీవిని పెద్ద నాన్న అని పిలిచేవారు. కానీ ఆ ఈవెంట్లో చిరంజీవి గారు అని అసంబోధించి మాట్లాడారు. తర్వాత చిరంజీవి స్టేజిపైకి ఎక్కి తన అభి ప్రాయాలను పంచుకున్నారు. అయితే వెళ్లగానే ‘రోషన్ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను చిరంజీవి అంటూ పేరు పెట్టి పిలుస్తావు..’’అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు.
అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ముఖంలో చిరునవ్వు చిందిస్తూ.. తనను పెద్ద నాన్న అని పిలిస్తే తప్పేంటిరా అంటూ రోషన్ కు చెప్పాడు చిరంజీవి. ఎంతమందిలో ఉన్నా మీ నాన్నకు నేను అన్నను, నీకు పెద్దనాన్నను రా రోషన్ అంటూ రోషన్‌ను దగ్గరికి తీసుకున్నారు. దీంతో రోషన్ ఫేస్ కళకళలాడిపోయింది. అలా వారి సినీ బంధాన్ని.. అతడికి వాళ్ల నాన్నకు ఉన్న రిలేషన్ ను చిరంజీవి గుర్తు చేశాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…