అటు ఇటుగా సినీపరిశ్రమలోకి చిరంజీవి, విజయశాంతి ఒకేసారి అడుగుపెట్టారు. మొదటిసారిగా ‘సంఘర్షణ’ సినిమాతో ఎంటరై ఓ జంటగా కనిపించారు. చిరంజీవి.. విజయశాంతితో ఛాలెంజ్, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కలిసి నటించారు.

గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు వరకు చిరంజీవి, విజయశాంతి ఒక అండర్ స్టాండింగ్ తో ఉన్నప్పటికీ ఆ చిత్రం విడుదల అనంతరం గ్యాంగ్ లీడర్ సినిమాలో విజయశాంతిని పోస్టర్స్ లో సరిగా చూపించలేదని అలాగే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో చిరంజీవి అన్నీ తానై సినిమాని భుజస్కంధాలపై వేసుకుని కనిపించారని..’గ్యాంగ్ లీడర్’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి విజయశాంతి హాజరు కాలేదని సినీ ప్రముఖుల విశ్లేషణ. ఈ సినిమా అనంతరం చిరంజీవి, విజయశాంతి కలిసి ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో మాత్రమే నటించారు. ఆ క్రమంలో చిరంజీవి, విజయశాంతి సెపరేట్ గా ఇతర చిత్రాలలో నటించారు.
Chiru – Vijayashanti : కొద్ది నెలల తేడాతో వచ్చిన బిగ్ బాస్, లేడీ బాస్ చిత్రాలు

1995లో శ్యాం ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్,మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో “బిగ్ బాస్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, రోజా హీరో,హీరోయిన్స్ గా నటించారు. అలాగే అలనాటి హీరోయిన్ మాధవి ఓ ప్రధాన పాత్రలో కనిపించారు. ఫ్యామిలీ, కమ్ మాసివ్ లుక్ తో చిరంజీవిని ‘గ్యాంగ్ లీడర్’ లో చూపించిన విజయబాపినీడు అదే స్పిరిట్ తో ‘బిగ్ బాస్’ చిత్రాన్ని రూపొందించారు. కానీ ఫలితం గ్యాంగ్ లీడర్ సినిమాకి భిన్నంగా వచ్చి ఒక ఫెయిల్యూర్ గా నిలిచింది.

‘కర్తవ్యం’ చిత్రం తర్వాత విజయశాంతి క్రేజ్ అమాంతం ఆకాశాన్నంటుకుంది.ఈ క్రమంలో ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించడం మొదలు పెట్టారు. అలా ఆశయం, వైజయంతి,పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, శాంభవి ఐపిఎస్, ఇందిరమ్మ, నాయుడమ్మ, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాల్లో నటించారు. 1995, గీతాచిత్ర ఇంటర్నేషనల్ నిర్మాణం, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘లేడీబాస్’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ లో విజయశాంతి కనిపించారు. వినోద్ కుమార్, చరణ్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అపజయాన్ని మూటగట్టుకుంది. ఇలా చిరంజీవి, విజయశాంతి సపరేట్ గా కొద్ది నెలల తేడాతో వచ్చిన బిగ్ బాస్, లేడీ బాస్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చాయి.





























