Chitti Babu : లైగర్ సినిమా విడుదల అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇక అందరూ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి సినిమా హిట్ అవడం ఫ్లాప్ అవడం కామన్, అందరి హీరోలకు హిట్ సినిమాలే ఉండవు, కొన్నిసార్లు ఫ్లాప్ లు డిజాస్టర్లు వస్తాయి. కానీ ఎవరికీ ఇపుడు విజయ్ ఎదుర్కొంటున్న నెగెటివిటీ రాలేదు. దీనికి కారణం విజయ్ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన మాటలు. చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ హీరోల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. అయితే విజయ్ ఆటిట్యూడ్ చూపించడం తో వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు.

ఎన్టీఆర్ ను చూసి నేర్చుకో…
ఇక ఈ విషయం మీద నిర్మాత చిట్టిబాబు స్పందిస్తూ విజయ్ ‘పెళ్లి చూపులు’ సినిమా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, ఇక ఆటిట్యూడ్ చూపిస్తే ఇలానే అవుతుంది. హిట్లు ఫ్లాపులు అందరికీ మామూలే కానీ సినిమా ఫలితం ఎలా ఉన్నా కెరీర్ లో నువ్వు ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలి మర్యాద ఇవ్వాలి ఎదుటివారికి. పబ్లిసిటీ లో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, ఒక హిట్ వచ్చినంత మాత్రాన ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఎలా? ఎన్టీఆర్ ను చూసి నేర్చుకో. ఎంత పెద్ద హీరో అయినా ఎంత ఇమేజ్ ఉన్నా పబ్లిసిటీ లో మాట్లాడేటపుడు ఎంత చక్కగా మాట్లాడుతాడో, ఒకరిని పరోక్షంగా కూడా విమర్శించడం చేయలేదు.

అంత పెద్ద హీరో అయినా ఏనాడు ఆటిట్యూడ్ చూపించలేదు. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడం తో తెలిసివచ్చినట్లుంది తప్పు అందుకే ముంబై థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి క్షమాపణ చెప్పాడు. ఇప్పటికైనా ఎలా మసలుకోవాలో తెలుసుకుంటే కెరీర్ బాగుంటుంది. పెళ్లి చూపులు సినిమా స్థాయి నుండి విజయ్ లైగర్ వంటి పాన్ ఇండియా సినిమాకు వచ్చాడు. ఇంకా కెరీర్ బాగుండాలి అది ఆటిట్యూడ్ వల్ల నాశనం చేసుకోకూడదు అంటూ అభిప్రాయపడ్డారు.


































