Choreographer Prem Rakshith : ప్రపంచవ్యాప్తంగా త్రిపుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ముఖ్యంగా నాటు నాటు పాట ఒక ఊపు ఉపేసింది. అలాంటి పాటలో హేరోలిద్దరూ ఒకేలాగా వేసే నాటు నాటు స్టెప్ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వేసి ఆ పాట మీద ఆ స్టెప్స్ మీద ఉన్న అభిమానం చాటుకున్నారు. ఇక ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్. ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ స్వస్థలం పుదుచెర్రీ. ఆయన మొదట్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలను పడి చివరకు ప్రపంచం మొత్తం తన స్టెప్స్ ను మెచ్చుకునే స్టేజికి ఎదిగారు.

రాజమౌళి గారికి నిజం చెబితే తీసేస్తారని…
మొదట్లో సినిమాలకు డాన్స్ కంపోజ్ చేస్తూనే రాజమౌళి గారి ఇంట్లో పిల్లలకు డాన్స్ నేర్పించేవారు ప్రేమ్ రక్షిత్. తాను సినిమాలకు డాన్స్ కంపోజ్ చేస్తాననే విషయం చెబితే పనిలో నుండి రాజమౌళి తీసేస్తారనే భయంతో ప్రేమ్ రక్షిత్ ఆ విషయం దాచిపెట్టారట. ఒకసారి ‘విద్యార్థి’ సినిమా షూటింగ్ లో డాన్స్ కంపోజ్ చేస్తుండగా పై నుండి ప్రేమ్ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేసిన పాట వినిపించడంతో వెళ్లి చూస్తే రాజమౌళి గారు ఉన్నారట, ఆ సాంగ్ బాబా మాస్టర్ ఎవరో చేసారని అనుకున్నారట.

వెంటనే ప్రేమ్ రక్షిత్ తానే డాన్స్ కంపోజర్ అని చెప్పడంతో ఎందుకు నాకు చెప్పలేదని అడిగారట. చెబుతే పని పోతుదితుంది నా కుటుంబాన్ని పోషించుకోడానికి డబ్బు ముఖ్యం అందుకే చెప్పలేదు అని చెప్పగానే జక్కన ఒక సీడి ఇచ్చి స్టెప్స్ కంపోజ్ చేయమన్నారట. అలా వారిద్దరి ప్రయాణం మొదలై నేడు ఆస్కార్ వేదిక వరకు ఎదిగింది.