Choreographer Suchitra Chandrabose: డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సుచిత్ర చంద్రబోస్. చెన్నై లో పుట్టి పెరిగిన సుచిత్ర డాన్స్ నేర్చుకుని మొదట రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. ఇక అంతకంటే ముందు ఇంట్లోవాళ్లకు తెలియకుండా గ్రూప్ డాన్సర్ గా కూడా పనిచేసి ఆ తరువాత టాలెంట్ తో డాన్స్ మాస్టర్ గా ఎదిగిన సుచిత్ర గారు పాటల రచయిత చంద్రబోస్ గారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. పెళ్లి తరువాత కూడా కెరీర్ ను కొనసాగించిన సుచిత్ర గారు తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధిచిన విషయాలను పంచుకున్నారు.

పెళ్ళయ్యాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా…
సుచిత్ర ‘కొబ్బరి బోండాం’ సినిమాతో కొరియోగ్రాఫర్ గా అడిగిపెట్టి ఆ తరువాత పలు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇక ‘పెళ్లి పీటలు’ సినిమాకు సింగల్ కార్డు కొరియోగ్రాఫర్ గా ఉన్న సుచిత్ర గారు అప్పటికే చంద్రబోస్ గారు తెలిసినా పరిచయం మాటలు మాత్రం పెళ్లిపీటలు సినిమా సమయంలోనే అంటూ చెప్పారు. ఆ సినిమా వేడుకలో సుచిత్ర గారిని చూసి చంద్రబోస్ గారు పాట పాడటంతో ఆమెకు అనుమానం వచ్చి పిలిచి ఏంటి ఇదంతా అని అడుగగా చంద్ర బోస్ గారు పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పారట. ఇక సుచిత్ర గారు అయితే మా ఇంట్లో మీ ఇంట్లో అడిగి వాళ్ళు ఒప్పుకున్నాక నన్ను వచ్చి కలవండి అని చెప్పగా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు చంద్రబోస్ గారు.

అయితే పెళ్ళయ్యాక కొరియోగ్రాఫర్ కావడం వల్ల ఆఫర్స్ తగ్గిపోవడం, ఒక్క అవకాశం లేకపోవడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ సుచిత్ర గారు తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో తమిళ్ నుండి ఆఫర్ రావడంతో వాళ్లకు ప్రెగ్నెంట్ అన్న విషయం దాచి సూర్య జ్యోతిక సినిమాకు డాన్స్ కంపోజ్ చేసారు. ఆ తరువాత మళ్ళీ వరుస అవకాశాలు వచ్చాయంటూ మర్చిపోలేని సంఘటన అంటే ‘వాడు వీడు’ సినిమాకు తమిళ్ లో అవార్డు తాను డాన్స్ నేర్చుకున్న రఘు మాస్టర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది అంటూ చెప్పారు. సంపాదించిన దాని గురించి మాట్లాడుతూ కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు, ఇక కూతురు ఇంటర్ చదువుతోంది అంటూ చెప్పారు. చాలా హ్యాపీగా ఉండే స్వీట్ హోమ్ మాది, అదే నేను చంద్రబోస్ సంపాదించుకున్నది అంటూ చెప్పారు.




























