Church Pastor : బాబాలు, స్వాములు, పాస్టర్ల ముసుగులో ఆడవాళ్ళ మీద అకృత్యాలకు పాల్పడే వారికి ఇండియాలో కొదవ లేదు. గౌరవమైన స్థానలో ఉండి నీచంగా ఆలోచంచే ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన స్వాములు, పాస్టర్ల మీద కూడా నమ్మకం పోతోంది. తాజాగా సంగారెడ్డి లో ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. చర్చ్ పాస్టర్ గా ఉంటూ పాడు పనులను చేసిన ఒక వ్యక్తిని అతని భార్యే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ప్రేయసితో పాస్టర్ రాసలీలలు…
సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం ఊరుకి చెందిన పెనుయేలు చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నట్లు, గతంలో ఐదు మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నట్లు ఊరి దృష్టికి రాగా మారడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా అడగడంతో వదిలేశారని ఆ ఊరి వ్యక్తి తెలిపారు.

అయితే మారని పాస్టర్ మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో భార్యకు అనుమానం వచ్చి ఇద్దరూ కలుసుకున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ మహిళను చితకబాదింది. ఈ విషయం ఇపుడు ఊర్లో కలకలం రేపింది. చర్చ్ కి వెళ్ళాలంటే భయంగా ఉందని కుటుంబంతో కలిసి చర్చ్ కి, అలాంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళలేమని, అతడిని ఊరి నుండి బయటికి పంపించేయాల్సిందిగా కోరుతున్నారు ఊరి ప్రజలు.



























