Comedian Babu Mohan : నా కోసం శోభన్ బాబు గారు అర్ధ రాత్రి 2 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది…బాలకృష్ణ సినిమాకి 2 గంటలు టైం ఇచ్చాను…: కమెడియన్ బాబు మోహన్

0
94

Comedian Babu Mohan : మామగారు సినిమాతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్, అనతి కాలం లోనే మంచి స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అప్పట్లో బాబు మోహన్, కోటా శ్రీనివాస్ రావు గారి కాంబినేషన్ అంటే సినిమాకి ప్లస్ అనేంతగా వాళ్ళ కాంబినేషన్ హిట్ అయింది. ఆ తరువాత బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబినేషన్ కూడా అంతే క్లిక్ అయింది. ఒకానొక దశలో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిన బాబు మోహన్ గారు అప్పటి పరిస్థితుల గురించి ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

బాలకృష్ణ సినిమాలో రెండు గంటల కాల్షీట్ ఇచ్చాను…

ఇక బిజీ ఆర్టిస్ట్ గా మారిన బాబు మోహన్ గారికి సినిమాల్లో కచ్చితంగా ఒక సాంగ్ కుడా అప్పట్లో ట్రెండ్ అయింది. చాలా సినిమాలకు డేట్లు కూడా సర్దుబాటు చేసే పరిస్థితి లేదు దాంతో కొన్ని వదులుకోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో కొంతమంది దర్శకులు రోజుకి అర్ధగంట అయిన చాలు వచ్చి వెళ్ళు అంటూ చెప్పేవారట. అలా బాలకృష్ణ సినిమాకు రెండు గంటలే కాల్షీట్ ఇచ్చిన బ్రహ్మానందం నా కాంబినేషన్ లో సన్నివేశాలు బాగా పేలింది సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

ఇక మరో సందర్బంలో శోభన్ బాబు గారు, బాలకృష్ణ గారి సినిమాలో నా కాల్షీట్ కుదరక సాయంత్రం షూటింగ్ చేయవలసి రావడంతో ఎప్పుడు షూటింగ్ ఆరు దాటాక చేయని శోభన్ బాబు గారు నా వల్ల సాయంత్రం నుండి రాత్రి 2 గంటల దాకా చేసారు అంటూ అప్పటి జ్ఞాపకాలు చెప్పారు బాబు మోహన్. మళ్ళీ కుదిరితే మా అన్న కోటా గారితో కలిసి కామెడీ సన్నివేశాలు చేయాలని ఉంది అంటూ మనసులోని మాట చెప్పారు.