Comedian Dhanraj : ‘జై’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధనరాజ్ ఆ తరువాత ‘జగడం’ సినిమాతో మొదటి సారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇక జబర్దస్త్ షో ధనరాజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ధనరాజ్ తెలుగులో మొదటి సారి మొదలయిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కాంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆరు వారాల తరువాత ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇక ఆ తరువాత మా టీవీ లో కామెడీ షో చేస్తూ, ప్రస్తుతం ఒకవైపు సినిమాలను చేస్తూనే మరో వైపు కామెడీ షోలో చేస్తున్నారు.

ఆరోజు మసాజ్ పార్లల్ లో జరిగింది అదే…
నా తప్పు లేకుండా నా ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటనలో నన్ను ఇరికించేశారు. ఆ బ్యూటిపార్లల్ లో రిసెప్షన్ దగ్గర నేను గోర్లు కట్ చేసుకుంటూ బయటే ఉన్నాను, నా ముందే పాపులర్ టీవీ అని వాళ్ళు కొంతమంది కెమెరా పట్టుకుని నా ముందుకు వస్తే ఏంటి ఏం జరిగింది అని అడిగాను. అడిగితే లోపల ఏదో జరిగింది షూట్ చేయడానికి వచ్చాము అని చెప్పారు. అందులో ఒకరు నాకు బాగా తెలిసిన వ్యక్తే. పక్కనే కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. నా పని అయిపోయినా ఏం జరుగుతుందో అని చూడటానికి అక్కడే నిలబడి కానిస్టేబుల్ పక్కన నిల్చొని చూస్తున్నా, లోపలికి వెళ్లి వచ్చిన మనుషులు మైక్ నా ముందు పెట్టి స్పందన చెప్పండి అన్నారు. నాకసలు అర్థం కాలేదు, కొంతసేపటికి పోలీసులు నన్ను వెళ్ళాలి అంటే వెళ్ళనివ్వలేదు సీఐ వచ్చే వరకు ఉండాల్సిందే అన్నారు, ఆలోపు మీడియాలో నా గురించి ఏదేదో రాసారు.

ఆ తరువాత పోలీసులే నా పైన క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు ఆ సంఘటన కు ధనరాజ్ కు సంబంధం లేదు అంటూ చెప్పారు. కానీ అది మీడియాలో రాలేదు, ఆ రోజు నేను చేయని తప్పుకు ఏడ్చాను. ఒకసారి ఒక సినిమా రికార్డింగ్ కోసం స్టూడియోకి వెళితే పూరి జగన్నాథ్ గారు పిలిచి ఎంధుకు ఏడ్చావ్ అని అడిగారు, అక్కడ నువ్వు తప్పు చేయనప్పుడు సీసీ కెమెరా ఫూటేజ్ తెప్పించండి అంటే సరిపోయేది కదా, ఒకవేళ నిజంగా అక్కడ తప్పు జరిగినా నీకేంటి సంబంధం అది ఆ పార్లల్ వాళ్లకు ఇబ్బంది. అందుకు ఏడ్చేస్తావా అంటూ అన్నపుడు నిజమే కదా అని అనిపించింది.
































