Comedian Dhanraj : ‘జై’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధనరాజ్ ఆ తరువాత ‘జగడం’ సినిమాతో మొదటి సారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందర్ వంటి సినిమాలతో కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఇక జబర్దస్త్ షో ధనరాజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ధనరాజ్. తెలుగులో మొదటి సారి మొదలయినా బిగ్ బాస్ రియాలిటీ షోలో కాంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆరు వారాల తరువాత ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇక సినిమాలలో ఎక్కువ నటించాలని భావిస్తున్న ధనరాజ్ హీరోగా ఛాన్స్ వస్తే మనకు చెప్పేవారు లేక వచ్చిన సినిమాలన్ని చేసేస్తాం కానీ మనకు నప్పే కథలు వచ్చినపుడు మాత్రమే చేయాలి. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అంటూ చేస్తే ఎవరూ చూడరు ఈ విషయంలో నేను తెలుసుకున్నాను అందుకే కథలో మంచి పాత్ర అయితే చేయాలని అనుకుంటున్నాను అంటూ తన అలసీలు పంచుకున్నారు.

సుధీర్ చేయకపోడానికి కారణం అదే…
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి మాటీవీ లో కమెడియన్ షో కి హోస్ట్ గా చేశారు. ఇక సినిమాల్లో కూడా చేస్తున్న సుధీర్ ఎందుకు జబర్దస్త్ వదిలి వెళ్ళాడు అన్న ప్రశ్నకు ధనరాజ్ మాట్లాడుతూ తాను ఒక చేంజ్ కోరుకున్నాడు, హోస్టింగ్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఆ షో నుండి బయటకు వచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా హోస్టింగ్ చేసాడు కదా అలానే మా టీవిలో కూడా హోస్టింగ్ చేయాలనే వచ్చాడు.

ఇపుడు మా టీవీ లో కూడా గ్యాప్ తీసుకున్నాడు. ఆహా ఒరిజినల్స్ లో స్టాండ్ అప్ కామెడీ షోలో హోస్ట్ గా చేయడానికి దీపిక పిల్లి, సుధీర్ జంటగా స్టాండ్ అప్ కామెడీ షో రానుంది, అందుకోసం టీవీ నుండి బ్రేక్ తీసుకున్నాడు. కొత్తగా ఏదైనా చేయాలని ఒక ఇమేజ్ నుండి బయటకి రావాలని భావించి వెళితే ఏవేవో పుకార్లు బయటికి వస్తుంటాయి. లోపల జరిగేవి తెలియవు ఒక మూడు నెలలు బ్రేక్ ఇస్తే ఆ ఛానెల్ నుండి వెళ్లిపోయాడు అన్నట్లు మాట్లాడుతారు, మళ్ళీ అదే ఛానెల్ కి వస్తే అవకాశాలు లేక మళ్ళీ అదే ఛానెల్ కి వచ్చాడు అంటారు. బయటివారికి లోపల ఏం జరుగుతోందో తెలియదు పూకార్లు నమ్మేస్తారు అంతే అంటూ చెప్పారు ధనరాజ్.

































