జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడంటూ సోమవారం తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైపర్ ఆది తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పితీరాల్సిందే అంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా హైపర్ ఆది మాట్లాడారని ఆరోపించింది.
ఈ నేపధ్యంలో హైపర్ ఆది ఈ వార్తలపై స్పందించాడు.. హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలను కించపరచలేదు. అసలు ఆ స్క్రిప్ట్ రాసింది నేను కాదు. అక్కడ నేను కేవలం ఆర్టిస్ట్‌ను మాత్రమే అని తెలిపారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…