Comedian Karumanchi Raghu : సినిమాల్లో కమెడియన్ గా అలాగే జబర్దస్త్ లోను మొదట్లో కమెడియన్ గా వచ్చిన రోలర్ రఘు ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆది, అదుర్స్ వంటి సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన కారుమంచి రఘు ఈ మధ్య కాలంలో తక్కువ సినిమాలను చేస్తున్నారు. దాదాపు 150 సినిమాలకు పైగా కమెడియన్ గా చేసిన రఘు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలలో నటించకపోడానికి కారణం అలాగే తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో కూడా తాను ఉన్న తీరు గురించి వివరించాడు.

డబ్బులు పోయినా పెళ్ళానికి కూడా తెలియనివ్వలేదు…
రఘు ఒకానొక సమయంలో తాను అప్పటివరకు సంపాదించిన డబ్బులన్నీ కోల్పోయాడు. అయితే ఆ మూడు నెలలు బాగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన ఎవరికీ ఈ విషయాలను చెప్పలేదని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు సహాయం చేసాడనే వార్తల్లో నిజం లేదని తానకే కాదు నేను ఎవరికీ ఇంట్లో పెళ్ళానికి కూడా ఎంత డబ్బు పోగొట్టుకున్నానో చెప్పలేదని చెప్పాడు రఘు. అయితే ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో నేను ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేసానని తెలిసీ ఎన్టీఆర్ మళ్ళీ ఒకరోజు డబ్బులు పోయిన విషయం నాకెందుకు చెప్పలేదు బే అని అన్నాడు.

కానీ నేనెవరి దగ్గరా సహాయం తీసుకోలేదు. ఒక మూడు నెలలు టెన్షన్ పడ్డాను, తినడానికి ఇబ్బంది లేదు సొంత ఇల్లు ఉంది. కేవలం పిల్లలు భవిష్యత్తు గురించి బయమేసింది. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే లోపు మళ్ళీ కొంత సంపాదించాలని అనుకున్నాను. వాళ్ళను బాగా చూసుకోగలిగితే చాలు అనిపించింది. ప్రస్తుతం వాళ్ళను బాగా చూసుకోగలుగుతున్నాను అది హ్యాపీ అంటూ చెప్పారు.































