Comedian Pruthvi daughter Sreelu : హీరోల కొడుకులు కూతుర్లు హీరోయిన్స్ గా వస్తున్న జమానాలో కమెడియన్ గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీ రాజ్ కూతురు శ్రీలు హీరోయిన్ గా తెలుగు సినిమాలో రాబోతోంది. అది కూడా తన తండ్రి సొంత డైరెక్షన్ లో హీరోయిన్ గా చేయబోతున్న శ్రీలు తన నేపథ్యం అలాగే ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకుంది వంటి పలు ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అటువంటి కామెంట్స్ కి మొదట్లో ఏడ్చేదాన్ని…
శ్రీలు కి చిన్నతనం నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండటంతో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారట. ఆపైన ఫోక్, వెస్ట్రన్ ఇలా అన్ని రకాల డాన్స్‌లను నేర్చుకున్న తరువాత యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏర్పడటంతో పెద్దయ్యాక నటి అవ్వాలని నిర్ణయించుకుంది. అయితే మొదట సినిమాల్లో చేస్తానని ఇంట్లో చెప్పినపుడు తండ్రి పృథ్వీ రాజ్ కష్టం, సుఖం రెండూ ఉంటాయి. ఒకరు అనే మాటలకు బాధపడతాను అంటే రావొద్దు. ఎలా అయినా నేను ఇండస్ట్రీలో ఉంటాను కష్టపడతాను అంటే నీ ఇష్టం అని చెప్పారట. అయితే చదువు పూర్తయ్యాక మాత్రమే సినిమాల్లోకి వెళ్లాలని చెప్పారట. అలా చదువుయ్యాక సినిమాల్లో నటించడం కోసం చాలా ఆడిషన్స్ కి వెళ్లినా సెలెక్ట్ అయినట్లే అయి రిజెక్ట్ అయ్యేదట శ్రీలు.

ఇక కొన్ని చోట్ల తెలుగమ్మాయిలు ఎంతమంది ఉన్నా చివరకు నార్త్ ఇండియన్ అమ్మాయిలను తీసుకున్నారట. ఇక రెండేళ్ల పాటు ఆడిషన్స్ కి వెళ్లి విసిగిపోయానని చెప్తుంది శ్రీలు. ఇక మొదట్లో సోషల్ మీడియా కామెంట్స్ చూసి బాగా ఏడ్చేదాన్ని అంటూ అమ్మకి చూపించి ఇద్దరం బాధపడేవాళ్లమని కానీ ఆ తరువాత ఇంట్లో నాకు కావాల్సిన ధైర్యం నాన్న ఇస్తున్నపుడు ఇటువంటి వాటికి భయపడకుడదని వదిలేసినట్టు చెప్పింది. ఇక పృథ్వీ రాజ్ గారు ఆయన భార్య ఒక సినిమా చేయాలని అనుకోని ఆడిషన్స్ పెట్టారట. మొదట కూతురుని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచన లేకపోయినా తెలుగు వాళ్లనే మొత్తం అందరినీ పెట్టాలని అనుకుంటూ ఆడిషన్స్ లోనే కూతురిని కూడా సెలెక్ట్ చేశారట. అలా ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమాలో హీరోయిన్ గా శ్రీలు నటిస్తోంది. ఆ సినిమాకు డైరెక్షన్ పృథ్వీ గారే చేస్తున్నారు.


































