Comedian Pruthvi Raj : అక్కడ భజన చేయాలి… రిషి కొండకి చుట్టూ గుండు గీశారు… గ్రీన్ మ్యాట్ వేసి షూటింగ్…: పృథ్వీ రాజ్

0
217

Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. వైసీపీ మీద తీవ్రంగా విమర్శలను చేసే పృథ్వీ ఈ సారి రిషి కొండ మీద వైసీపీ ప్రభుత్వం అక్రమాలను తెలిపారు.

రిషి కొండకు గుండు గీశారు…

తాను వెనక నుండి ఎవరినో వాటేసుకొని ఉన్నాను అంటూ నా మీద ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటికి గేంటేసారు. అయితే వైసీపీ లోనే మంత్రులుగా అలాగే ఎంపీలుగా కొనసాగుతున్న కొంతమంది చేస్తున్న పనులు కనిపించవా అంటూ పరోక్షంగా గోరంట్ల మాధవ్ అలాగే అంబటి రాంబాబు గురించి విమర్శించారు పృథ్వీ రాజ్. అక్కడ భజన చేసే వాళ్ళకే చోటుంటుంది అంటూ చెబుతూ ఇక తాజాగా జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి కూడా విమర్శించారు.

వైజాగ్ లోని రిషికొండ వద్ద ఇటీవల ఒక సినిమా షూటింగ్ చేశాను. అక్కడ గ్రీన్ మ్యాట్ వాడారు, మొత్తం రిషి కొండా చుట్టూ గుండు గీసినట్లు తవ్వకాలు చేసేస్తే ఇక గ్రీన్ మ్యాట్ వాడక ఏం చేయాలి, వైజాగ్ సముద్రంలో ఉప్పు నీళ్లు కాబట్టి వైసీపీ వాళ్ళు వదిలేసారు లేకపోతే ఆ సముద్రాన్ని ఎత్తుకుని పోయేవాళ్ళు అంటూ విమర్శలను చేసారు.