Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి అలాగే తన సినిమా జీవితం గురించి మాట్లాడారు.

రెమ్యూనరేషన్ లక్షల్లో ఉంటుందని అనుకుంటారు…
సినిమాల్లో ఒక సారి మంచి గుర్తింపు వస్తే అవకాశాలు బాగా వస్తున్నాయి అనుకుంటారు. ఒక వేల అవకాశాలు వస్తున్నా అందుకు తగ్గట్టు రెమ్యూనరేషన్స్ రావు. బయట కానీ మేము ఒక సినిమాలో సక్సెస్ అయితేనే లక్షల్లో రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నామని అనుకుంటారు. కరోనా వచ్చి ఇబ్బందులు పడినపుడు కూడా నాకు దాదాపు 15 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ఆ సమయంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది ఊరికే షో చేస్తున్నాను కరోనా ఏం రాలేదు అనుకున్నారు.

కానీ నేను అపుడు పడిన బాధ ఎవరికీ తెలియదు. చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను. అపుడు నా కొడుకే నాకు ఆర్థికంగా చూసుకున్నాడు. అతనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రోజుకు లక్ష సంపాదిస్తున్నాను అంటూ బయట మాట్లాడుకోడానికి బావుంటుంది. నిజానికి అంత రెమ్యూనరేషన్ రాకపోయినా అంత వస్తున్నట్లు బిల్డప్ ఇవ్వాలి. నిజానికి ఒక ప్రాస్టిట్యూట్ అందంగా రెడీ అయితేనే బుక్ చేసుకుంటారు. అలానే ఆర్టిస్ట్ కూడా పైపై మెరుపులు, కారు అన్నీ కనిపిస్తేనే తీసుకుంటారు అంటూ చెప్పారు. అందుకోసమే ఒక స్టేటస్ లాంటిది మైంటైన్ చేయాల్సి వస్తుంది అంటూ చెప్పారు.



























