Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి సీఎం జగన్ వ్యవహారశైలి గురించి మాట్లాడారు.

అంత పెద్దమనిషిని అవమానిస్తారా…..
వైసీపీ పార్టీలో ప్రతిదీ సలహా దారులు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం మీడియ ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు అంటూ పృథ్వీ విమర్శించారు. చంద్రబాబు అయితే వెన్నుపోటు, పవన్ అయితే మూడు పెళ్లిళ్లు ఇవి తప్ప మేము ఏమి చేసాము అనే విషయాలను ప్రజలకు మాత్రం చెప్పరు. ఇక సినిమా టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ తరుపున పెద్దమనిషి లాగా చిరంజీవి గారు మిగతా వాళ్ళు జగన్ తో మాట్లాడటానికి వస్తే ఆయన వ్యవహారశైలి ఎలా ఉందొ అందరికి తెలుసు.

అంత పెద్ద హీరో ముందు కాళ్ళు ఊపుతూ ఆయన హవభావాలు మీరు నా ముందుకు వచ్చారు అన్నట్లుగా అహంకారం చూపించారు. చేతులు కట్టుకుని చిరంజీవి గారు మాట్లాడటం ఇండస్ట్రీ కి దిక్కు మీరే అన్నట్లుగా ఆయన అంత వినమ్రంగా మాట్లాడారు అది లైవ్ మీడియా ఇచ్చారు. ఏ నాడు లైవ్ ప్రెస్ మీటింగ్ కానీ మీడియా సమావేశాలు కానీ పెట్టని జగన్ ఆ రోజు మాత్రం నా ముందుకు వీళ్లంతా వచ్చారు అన్నట్లుగా చేసారు అహంకారం ఎంతో కాలం నిలవదు అంటూ విమర్శించారు పృథ్వీ రాజ్.
































