Comedian Pruthvi Raj : పెళ్లి నా జీవితాన్ని చాలా దెబ్బతీసింది… మా బ్రతుకు ప్రొస్టిట్యూట్ లాంటిది…: కమెడియన్ పృథ్వీ రాజ్

0
101

Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి అలాగే తన సినిమా జీవితం గురించి మాట్లాడారు.

పెళ్లి జీవితం మీద దెబ్బ కొట్టింది…

ఒకరిద్దరు తప్పు చేసారని మొత్తం ఆడవాళ్ళు అలాగే ఉంటారని నేను అనను, నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది అంటూ పృథ్వీ రాజ్ మాట్లాడారు. తన జీవితంలో పెళ్లి చాలా దెబ్బతీసిందని ఇక ఆ గతపు జ్ఞాపకాలను మర్చిపోయానంటూ సాఫ్ట్ వేర్ డిలీట్ చేశా అంటూ చెప్పారు. ఇక సినిమా వాళ్లను వారి సంపాదనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, నన్ను కూడా రోజుకు మూడు దాక సంపాదిస్తున్నావంట కదా అంటారు. అవగాహనా లేకుండా మాట్లాడేస్తుంటారు.

ఒక ఆర్టిస్ట్ బతుకు ఓపెన్ గా మాట్లాడితే ప్రాస్టిట్యూట్ వంటిదే. ఉన్నా లేకపోయినా అందంగా తయారై డబ్బు లేకపయినా అది కనిపించకుండా తయారై కనిపించాలి. అంత రెమ్యూనరేషన్ రాకపోయినా అంత వస్తున్నట్లు బిల్డప్ ఇవ్వాలి. నిజానికి ఒక ప్రాస్టిట్యూట్ అందంగా రెడీ అయితేనే బుక్ చేసుకుంటారు. అలానే ఆర్టిస్ట్ కూడా పైపై మెరుపులు కారు అన్నీ కనిపిస్తేనే తీసుకుంటారు అంటూ చెప్పారు. అందుకోసమే ఒక స్టేటస్ లాంటిది మెయిన్టైన్ చేయాల్సిన వస్తుంది అంటూ చెప్పారు.