Comedian Roller Raghu : సినిమాల్లో కమెడియన్ గా అలాగే జబర్దస్త్ లోను మొదట్లో కమెడియన్ గా వచ్చిన రోలర్ రఘు ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆది, అదుర్స్ వంటి సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన కారుమంచి రఘు ఈ మధ్య కాలంలో తక్కువ సినిమాలను చేస్తున్నారు. దాదాపు 150 సినిమాలకు పైగా కమెడియన్ గా చేసిన రఘు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలలో నటించకపోడానికి కారణం ఆయన వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.

పాలిటిక్స్ మీద ఆసక్తి ఎక్కువ…
కమెడియన్ రఘు తన చదువుకునే సమయంలోనే పాలిటిక్స్ మీద ఆసక్తిని పెంచుకున్నారట. తాను డిగ్రీ చేసే సమయంలో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి తన బెంచ్ మేట్ అని అలాగే కాంగ్రెస్ లోనే మరో లీడర్ కుసుమ కుమార్ రెడ్డి కూడా మంచి మిత్రుడు అంటూ తెలిపారు. ఇక తనకు గురువు, మెంటార్ మైలాంపల్లి హనుమంతన్న అంటూ రఘు తెలిపారు. అయితే పాలిటిక్స్ లోకి వెళ్లాలని చాలా ఉన్నా తన తండ్రికి పాలిటిక్స్ అంటే నచ్చేది కాదని, తాను మిలిటరీలో పనిచేయడం వల్ల ఆయనకు రాజకీయాలు నచ్చేవి కాదని అందుకే తన ట్రాక్ మార్చుకున్నట్లు తెలిపారు.

పొలిటిక్స్ మీద ఇష్టం పోలేదని ఇప్పటికీ అనాలిసిస్ చేస్తుంటానని వివరించారు. రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బు ఉండాలి, అది సంపాదించాలి ముందు అందుకే వద్దనుకున్నా అంటూ వివరించారు. రేవంత్ రెడ్డి చాలా టాలెంటెడ్ అని ఇప్పటికే మంచి పొజిషన్ లో ఉండాల్సింది కానీ లేడు తప్పకుండా ఏదో ఒక రోజు సీఎం గా చూస్తాను అంటూ మాట్లాడారు.
































