Comedian Yadamma Raju : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైం లైట్ లోకి వచ్చారు. పలు ఈవెంట్లు, షోలు చేసుకుంటూ తెలుగు ప్రజలకు సుపరిచితులయ్యారు. ఆలా తన కామెడీతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ యాదమ్మ రాజు. జబర్దస్త్, పటాస్ షోల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజు, స్టెల్లా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు.

నీతో పడలేను విడాకులు కావాలి…
స్టెల్లా కూడా తన భర్త పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందరికీ పరిచయమైంది. ఇక ఈ జంట అటు జబర్దస్త్, మరియు కొన్ని డాన్స్ షోలలో పాల్గొంటూ బాగా ఫేమస్ అయ్యారు. అయితే పెళ్ళై ఏడాది కూడా గడవకముందే ఇద్దరూ విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి వాళ్ళు విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్త ప్రాంక్ అట. జబర్దస్త్ లో ఒక స్కిట్ లో భాగంగా అలా విడాకులు తీసుకోబోతున్న జంట లాగా నటించబోతున్నారట.

నీతో పడలేక పోతున్నా, విడాకులు కావాలి అంటూ స్టెల్లా అడుగుతుంది ఆ విడాకులు తీసుకోవడం కూడా ఒక వేడుకలాగా చేసుకోవాలని చెబుతుంది. ఇలా ప్రోమోలో హీట్ ను పెంచడంతో ఇదేం పైత్యం అంటూ జనాలు తిట్టుకుంటున్నారు. చక్కగా కలిసి ఉన్న జంట విడిపోతున్నారు అంటూ స్కిట్ ఏమిటి రేటింగ్స్ కోసం కలపడం, విడగొట్టడం ఇదేనా అంటూ మండిపడుతున్నారు.

































