Categories: FeaturedMovie News

Venu Swamy: అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వేణు స్వామి… ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక వేణు స్వామి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు కానీ ఈయన గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీతో ఎంతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. బాలకృష్ణ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమా పూజా కార్యక్రమాలలోనే ఈయన పాల్గొనేవారు.

ఇలా అప్పట్లో ఏదైనా సినిమా పూజ కార్యక్రమం ఉందంటే వేణు స్వామి తప్పనిసరిగా అక్కడ ఉండేవారు. ఇక ఇటీవల కాలంలో ఈయన సినిమా సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వేణు స్వామి చెప్పినది కొంతవరకు నిజమైనప్పటికీ ఇటీవల కాలంలో ఈయనకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ విజయం సాధిస్తారని ఐపీఎల్లో హైదరాబాద్ గెలుస్తుందని ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ సీఎం అవుతారని ఈయన చెప్పిన జాతకాలు పూర్తిగా అబద్ధం కావడంతో వేణు స్వామి ఇకపై తాను ఇలాంటి జాతకాలు చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టను అంటూ ఒక వీడియో షేర్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన చేసిన ఒక పని దారుణమైన ట్రోల్స్ కి గురి అవుతుంది.

మందు కొడుతూ..
వేణు స్వామి వీకెండ్ సందర్భంగా ఓ బార్ కి వెళ్లి తన మిత్రులతో కలిసి మద్యం సేవిస్తూ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలపై ఎంతో మంది స్పందిస్తూ పూజలు చేసి జ్యోతిష్యం చెప్పే మీరు ఒక పబ్లిక్ ఫిగర్. ఇలా బయటకు వచ్చి ఇలా మందు తాగడం ఏంటి అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. కానీ తనకు మందు తాగే అలవాటు ఉందని వీకెండ్ బార్ కి వెళ్తానని పూజలు చేస్తున్నంత మాత్రాన తనకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని గతంలోనే వేణు స్వామి తన అలవాట్ల గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago