Coromandel Train Tragedy : ఒక చిన్న పొరపాటు కొన్ని వందల మంది ప్రాణాలను గాల్లో కలిసేలా చేసింది. సిగ్నలింగ్ ఇచ్చే సిబ్బంది అలసత్వమే కోరమండల్ రైలు ప్రమాదానికి కారణం అయింది. 288 మంది చనిపోగా 1178 మంది గాయాలపాలైన ఈ ఘటనలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకోవటం వల్ల రైలు లూప్ లైన్ లోకి వెళ్లి ముందున్న గూడ్స్ బండిని ఢీకొట్టింది. ముందున్న రెండు భోగిలు ఎగిరి పక్కనున్న ట్రాక్ మీద పడగా అటుగా వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ ట్రైన్ ను ఢీ కొట్టడంతో ఆ ట్రైన్ పట్టాలు తప్పింది. ఇలా మానవ తప్పిందం వల్ల కొన్ని వందల కుటుంబాల్లో విషాదం మిగలగా ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం సిబిఐ విచారణకు అదేశించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే తాజాగా సిబిఐ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.

రైలు దుర్గటన కుట్రలో భాగమా??
ట్రైన్ ఆక్సిడ్నెట్ అయి రెండు వార్లలు కావొస్తున్నా ఇప్పటికీ అసలు కారణాలు ఏంటో తెలియరాలేదు. కాకపోతే సిగ్నలింగ్ లోపం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ప్రాథమికంగా భావించినా సిబిఐ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిబిఐ విచారణలో భాగంగా సిగ్నలింగ్ ఇంజనీర్ అమీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారించింది. ఆ తరువత రెండో సారి విచారణకు హాజరువ్వమని చెప్పగా అతను తన కుటుంబంతో సహా పరారీలో ఉండటం అనుమానాలకు తావిచ్చింది.

సిబిఐ అతని వివరాలను గోప్యంగా ఉంచినా ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చెప్పట్టారు. అతని ద్వారా కీలక విషయాలు తెలియవచ్చని, ఆక్సిడెంట్ కాదు ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర అయ్యుండొచ్చనే అనుమానలను బలపడుతున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ సిబిఐ కి దొరికి పోగా అతడిని రహస్యంగా విచారిస్తునట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ట్రైన్ ఆక్సిడెంట్ కి అసలు కారణాలు బయటపడే అవకాశం ఉంది.































