Health News

తల్లికి పాజిటివ్ ఉన్నా.. శిశువుకు పాలు ఇవ్వొచ్చా..? వివరాలు తెలుసుకోండి..

కరోనా మహమ్మారి గత 2020 మార్చి నుంచి మన దేశంలో కుణుకు లేకుండా చేస్తోంది. మొదటి వేవ్ లో కరోనా కేసులు పెరిగినా మరణాలు సంభవిచలేదు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవ్వడమే కలవరపెడుతోంది. అయితే దీనికి వ్యాక్సిన్ వచ్చినా కొంత మందికి అపోహలు మాత్రం తొలగిపోలేదు. ఇందులో భాగంగానే చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది. కరోనా సోకిన తల్లి.. తన శిశువుకు పాలు ఇవ్వాచ్చా.. ఇవ్వకూడదా.. అనేది చాలా మందికి తెలియదు. అయితే తాజాగా చేసిన పరిశోధనలు కొన్ని కీలక విషయాలు భయటకు వచ్చాయి. దీనిపై ఒక క్లారిటీని ఇచ్చారు.

కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వవచ్చు అని ఆ పరిశోధనలో తేలింది. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో ప్రసూతి, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మంజు పూరి ఇలా అన్నారు. పాలు ఇచ్చే సమయంలో తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆమె సూచించారు. పాలు ఇవ్వడానికి కొన్ని నిమిషాల ముందు చేతులకు శానిటైజర్ తో శుభ్రంగా కొడుక్కొని.. మూతికి మాస్క్ ధరించాలని సూచించారు. పాలు ఇవ్వడం అయిపోయాకా శిశువును తప్పనిసరిగా దూరంగా ఉంచాలని సూచించారు.

ఈ విధంగా తల్లికి కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చేదాకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. కొన్ని ఘటనల్లో పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్బాలు ఉన్నాయని.. అయితే తల్లి గర్భంలోనే కోవిడ్ బారిన పడ్డారా.. లేక పుట్టిన తరువాత వారికి కరోనా సోకిందా అనే విషయం స్పష్టంగా తెలీదు అని డాక్టర్ మంజు పూరి చెప్పారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ పై వచ్చే అపోహలను నమ్మ కూడదని ప్రజలకు సూచించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago