భారత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్.. కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేసింది బ్రెజిల్. ప్రెకిసా మెడికామెంటోస్, ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్ అనే బ్రెజిల్ సంస్థలు బ్రెజిల్ లో కోవాక్సిన్ ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అయితే తాజగా ఈ ఒప్పందాలలో అనేక అవినీతి జరిగిందనే ఆరోపణలు బ్రెజిల్ లో వచ్చాయి. అదే విధంగా రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను బ్రెజిల్ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలనే నిబంధన తీసుకువచ్చింది బ్రెజిల్ ప్రభుత్వం. దీనికి అంగీకరించని బారత్ భాయోటెక్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనితో బ్రెజిల్‌లోని ఫార్మా కంపెనీలు కోవ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపేశాయి.



























