తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..! వ్యాక్సిన్ కొరత.!!

0
416

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కరోన నేపధ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు అయిపోయాయి. ఈ నేపధ్యంలో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఈరోజు వరకే సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఈరోజు రాత్రి వరకు 2.7 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి పంపుతామని కేంద్రం సమాచారం ఇచ్చింది. ఒకవేళ అవి సమయానికి అందకపోతే రేపటి (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోనుంది. మరోవైపు టీకాల కోసం జనాలు భారీగా క్యూ కడుతున్నారు.