కమలహాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ చెన్నై శివార్లలో ఉన్న పూనమల్లి దగ్గర జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతన్న సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఒక భారీ క్రేన్ కూలి షూటింగ్ కోసం పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు మధు (29), కృష్ణ (34) మరియు చందన్(60) ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉన్నారు. ఇక డైరెక్టర్ శంకర్ కూడా గాయ పడినట్టు సమాచారం.
ఫిబ్రవరి 19న రాత్రి జరిగిన ఈ ఘటనతో ఒక్క సరిగా అంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ చిత్ర షూటింగ్ గత కొద్దీ రోజులుగా చెన్నై శివార్లలో ఈవిపి ఫిలింసిటీ లో జరుగుతుంది. ఇంకా కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో 150 అడుగుల ఒక భారీ క్రేన్ తెగి పడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కెమరా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న శంకర్ కూడా తీవ్రంగా గాయ పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ స్పాట్ లో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా..10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
డిజిటల్ మోనిటర్ చూసుకునే టెంట్ పై ఈ భారీ క్రేన్ పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో శంకర్ ప్రాణాలతో బయటపడినా ఆయన కాలికి మాత్రం తీవ్రగామైంది. ఆయన్ని హుటహుటిన సమీప ఆసుపత్రిలో చేర్పించారని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే షూటింగ్ స్పాట్ కి వచ్చిన కమల్ హాసన్ గాయ పడిన వారిని హాస్పిటల్ కి పంపించి అన్ని దగ్గరుండి చూసుకున్నాడట. కాగా కమల్ హాసన్, కాజల్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ -2 చిత్రం తెలుగులో భారతీయుడు -2 గా వస్తుంది. గతంలో అద్భుత విజయం సాధించిన “భారతీయుడు” చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో 30 శాతం షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేశారట. చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో మేజర్ షెడ్యూల్స్ అన్ని చిత్రీకరించాడు దర్శకుడు శంకర్. మరో కీలక షెడ్యూల్ కోసం మార్చ్, ఏప్రిల్ లో చైనా మరియు థాయిలాండ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈలోగా ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది.


#Indian2 mishap: 3 dead & 9 injured in the crane accident. The injured have been taken to a nearby hospital. Director Shankar is unhurt. pic.twitter.com/62Ux5Bav53
— Shabbir Ahmed (@Ahmedshabbir20) February 19, 2020



























