టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య అసలేం జరుగుతుంది? ఎందుకు ఉన్నట్టుండి వీళ్లిద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకు తెలియడం లేదు. అసలైతే ఎన్టీఆర్ 30 వ సినిమాను త్రివిక్రమ్ తోనే ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు.. ఎన్టీఆర్ ని కాదని మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో పుకార్లు వినిపించాయి.

అయితే వీటిపై అటు త్రివిక్రమ్ కానీ.. ఇటు ఎన్టీఆర్ కానీ ఏం స్పందించకపోవడంతో ఇది నిజమే అని అభిమానులు కూడా నమ్మారు. చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయన్నారు. అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్నా ప్రచారం మరోకంగా ఉంది. ఇకపై వీరిద్దరూ కలిసి సినిమా చేయడం ఉండదేమో అనే విధంగా కధనాలు వినిపిస్తున్నారు. ఇద్దరి మధ్యనే క్రియేటివ్ డిఫరెన్స్ లు పెరిగి పెద్దవై ఇద్దరూ విడిపోయే స్దాయికి వెళ్లాయని అనుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం వారిద్దరికే తెలియాలి.
కాకపోతే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటం వల్ల సినిమా ప్రాజెక్టులు కాన్సిల్ అవ్వడం సర్వసాధారణమైన విషయం.. ఈ క్రమంలో కొన్నిరోజులు వారిద్దరి మధ్య సంబంధాలు కొంచెం దెబ్బతినొచ్చు. కానీ అది తాత్కాలికమే. ఇక అలా వైకుంఠపురములో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి అద్భుతమైన మైలురాయి అందించిన త్రివిక్రమ్ రెట్టింపు ఉత్సాహంతో మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేసాడు. 2022 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు అని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
మరోపక్క కొరటాలతో ఎన్టీఆర్ సినిమా మొదలు కాబోతోంది. రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు కొరటాల. ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి.ఇక సినిమాలో ఎన్టీఆర్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది…!!































